రివర్స్‌ పీఆర్సీపై ఉద్యోగుల నిరసన

ABN , First Publish Date - 2022-01-27T05:36:23+05:30 IST

చీకటి పీఆర్సీ జీవోలన్నీ రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం ఉద్యో గులు, ఉపాధ్యాయులు నిరసన ప్రదర్శన చేశారు.

రివర్స్‌ పీఆర్సీపై ఉద్యోగుల నిరసన
భీమవరంలో మునిసిపల్‌ ఉద్యోగుల ఆందోళన

అంబేడ్కర్‌ విగ్రహాలకు ఉద్యోగుల వినతి


భీమవరం/నరసాపురం/ఆచంట/పాలకొల్లుఅర్బన్‌/ఆకివీడు/ వీరవాసరం/పోడూరు/పెనుమంట్ర, జనవరి 26 : చీకటి పీఆర్సీ జీవోలన్నీ రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం ఉద్యో గులు, ఉపాధ్యాయులు నిరసన ప్రదర్శన చేశారు.  మా హక్కులు కాపాడు అంటూ అంబేడ్కర్‌ విగ్రహాలకు వినతి పత్రాలు అందించారు. పీఆర్సీ సాధన కమిటీ పిలుపు మేరకు ఊరూ వాడా ఆందోళనలు సాగాయి.భీమవరం పురపాలక సంఘ ఉద్యోగులు తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. అనం తరం అంబే డ్కర్‌ సెంటర్‌కు ప్రదర్శనగా వెళ్లి విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.నరసాపురంలో ఉద్యోగ, ఉపాధ్యాయ ఐక్య వేదిక ఆధ్వర్యంలో శివాలయం సెంటర్‌ నుంచి అంబేడ్కర్‌ సెంటర్‌ వరకు భారీ ప్రదర్శన చేశారు. అనంతరం అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందించారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆచంట వేమవరం పీహెచ్‌సీ సిబ్బంది అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందిం చారు. పాలకొల్లులో ఉద్యోగులు ర్యాలీ చేసి గాంధీ బొమ్మల సెం టర్‌లోని అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఆకివీడు జిల్లా పరిషత్‌ బాలురు ఉన్నత పాఠశాలలో అంబేడ్కర్‌ విగ్రహానికి బుధవారం వినతిపత్రం అందజేశారు. వీరవాసరం యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో రాయకుదురు బస్టాండ్‌ వద్ద ఉన్న అం బేద్కర్‌ విగ్రహానికి  ఉపాధ్యాయులు వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో ఏపీ మునిసిపల్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌.కృష్ణమోహనరావు, వేండ్ర ప్రసాద్‌,పాషా, జేఏసీ నాయకులు కృష్ణకుమార్‌, రామ సుబ్బా రావు,అంజిబాబు, మార్కండేయులు, మనోజ్‌కుమార్‌, అలీ, మూర్తి,సూర్య నారాయణరాజు, పీహెచ్‌ఎన్‌ రత్నకుమారి, ఎంపీ హెచ్‌ఈవో ప్రేమానందం, ఫార్మాసిస్ట్‌ స్వామి, గుడాల హరి బాబు, వేగేశ్న మురళీ కృష్ణంరాజు,రామభద్రం, ఎంఆర్‌కె.ప్రసాద్‌, ఎం.సాయిబాబు,జీఎస్‌ఎన్‌రాజు,డాక్టర్‌ సి.రాఘవులు, తలాడి వెంకటేశ్వరరావు,నాగేశ్వరరావు, కలిశెట్టి ప్రసాద్‌, రామ శేషుబాబు,పెంకి విజయ్‌కుమార్‌, కవిత, శిరీష, ఉమా నాగేశ్వరరావు యూటీఎఫ్‌ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె.నాగమునేశ్వరరావు , ముద్రగళ్ళ శ్రీనివాస్‌, దేవిరెడ్డి పుల్లారావు, ఎం.సూర్యనారాయణరాజు, చీడే మహాలక్ష్మి, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.





Updated Date - 2022-01-27T05:36:23+05:30 IST