2020 మూడ్‌పై ఎమోజీలు

ABN , First Publish Date - 2020-09-26T05:43:08+05:30 IST

2020 అనేది డిజాస్టర్‌కు పర్యాయపదంగా నిలిచింది. దీనిని ప్రతిబింబించేలా ఎమోజీలు రానున్నాయి...

2020 మూడ్‌పై ఎమోజీలు

2020పై లెక్కలేనన్ని జోకులు వాట్స్‌పలో వైరల్‌ అవుతున్నాయి. 2020 అనేది డిజాస్టర్‌కు పర్యాయపదంగా నిలిచింది. దీనిని ప్రతిబింబించేలా ఎమోజీలు రానున్నాను. వాట్స్‌పలో మెసేజ్‌ పెట్టగానే అట్నుంచి ఒక ఎమోజీ ప్రత్యక్షమవుతుంది. ఆనందం, వెక్కిరింపు, దుఃఖం సహా వివిధ హావభావాలను వ్యక్తపరిచేందుకు ఉపయోగించే చిహ్నాలే ఎమోజీలు. ప్రస్తుత సంవత్సరం 2020ని వర్ణించే ఎమోజీలు ఇప్పుడు రాబోతున్నాయి. తనపై అదుపు తప్పిన లేదా హిప్నటైజ్‌ అయిన వ్యక్తిని పోలినట్టు ఇవి ఉంటాయి. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది జనం ఎదుర్కొంటున్న బాధలను సదరు ఎమోజీ ప్రతిబింబిస్తుంది. యూనికోడ్‌ కన్సార్టియమ్‌ ఈ సరికొత్త ఎమోజీలకు ఆమోదం కూడా తెలిపింది. నిజానికి ఈ ఎమోజీలు మన సెల్‌ఫోన్‌లో కీబోర్డుపైనే కనిపిస్తూ ఉంటాయి. 


తాము బాగాలేమని వ్యక్తం చేసే విధంగా సర్పిలాకారం లేదంటే సుడులు తిరిగినట్టు ఉండే కళ్ళతో ఉన్న ఎమోజీ ఒకటి ఉంది. ఎమోజీ 13.1... లేటెస్ట్‌ సెట్‌. ఇందులో మరో ఆరు కూడా ఉంటాయి. యూనికోడ్‌ కన్సార్టియం వీటిని లెటెస్ట్‌ సెట్‌గా గుర్తించింది. మొత్తం ఈ ఏడింటిని వచ్చే సంవత్సరం విడుదల చేయనుంది. ఇవన్నీ 2020కి గుర్తులు అన్న మాట. గుండెపై మంటలు, మెండింగ్‌ హార్డ్‌, గడ్డంతో మహిళ, గడ్డంతో పురుషుడు, భారంగా గాలిని పీలుస్తున్నట్టు, వ్యక్తి చుట్టూ మేఘాలు కమ్ముకున్నట్టుగా ఈ ఎమోజీలు ఉన్నాయి. సుడులు తిరిగిన కళ్ళు, భారంగా గాలి పీల్చుకున్నట్టు ఉన్న రెండు ఎమోజీలు పూర్తిగా 2020ని ప్రతిబింబిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు.


Updated Date - 2020-09-26T05:43:08+05:30 IST