ఎండలకు ఉపాధి కూలీలు జాగ్రత్తలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2021-05-06T06:46:06+05:30 IST

ఎండలో పనిచేస్తున్న కూలీలు తగు జాగ్రత్తలు తీసుకొని ఉపాధి పనులు చేయాలని డీఆర్డీవో పీడీ కిరణ్‌కుమార్‌ అన్నారు. పెన్‌పహాడ్‌ మండలం సింగారెడ్డిపాలెంలోని తుమ్మలకుంటచెరువులో ఉపాధి హామీ పనులను బుధవారం ఆయన పరిశీలించి మాట్లాడారు.

ఎండలకు ఉపాధి కూలీలు జాగ్రత్తలు తీసుకోవాలి
సింగారెడ్డిపాలెం గ్రామంలో ఉపాఽధి కూలీలతో మాట్లాడుతున్న కిరణ్‌ కుమార్‌

పెన్‌పహాడ్‌, మే 5: ఎండలో పనిచేస్తున్న కూలీలు తగు జాగ్రత్తలు తీసుకొని ఉపాధి పనులు చేయాలని డీఆర్డీవో పీడీ కిరణ్‌కుమార్‌ అన్నారు. పెన్‌పహాడ్‌ మండలం సింగారెడ్డిపాలెంలోని తుమ్మలకుంటచెరువులో ఉపాధి హామీ పనులను బుధవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. ఉదయం ఏడు గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే ఉపాధి పనులు చేయాలన్నారు. భౌతి క దూరం పా టిస్తూ, మాస్క్‌లు ధరించాలన్నారు. కూలీలకు ఎక్కువ పని దినాలను కల్పిస్తున్న ట్లు తెలిపారు. రోజుకు ప్రతికూలీకి రూ.240లు చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఎక్కువ మంది కూలీలు ఉపాధి పనులకు హాజరయ్యేలా చూడాలన్నారు. ఆయనవెంట ఇన్‌చార్జి ఎంపీడీవో శ్రీనివాస్‌, ఏపీవో రవి, ఈసీ ఏకస్వామి, పంచాయతీ కార్యదర్శి వెంకటేష్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-06T06:46:06+05:30 IST