HYD : Great.. సోదరి చనిపోయిందని సమాచారం.. దుఃఖాన్ని దిగమింగి విధులకు హాజరు!

ABN , First Publish Date - 2021-12-06T13:10:16+05:30 IST

సాధారణంగా ఆదివారం అంటే ఉద్యోగులు ఇంటిపట్టునే ఉంటారు. కానీ..

HYD : Great.. సోదరి చనిపోయిందని సమాచారం.. దుఃఖాన్ని దిగమింగి విధులకు హాజరు!

హైదరాబాద్ సిటీ/అంబర్‌పేట : సాధారణంగా ఆదివారం అంటే ఉద్యోగులు ఇంటిపట్టునే ఉంటారు. కానీ ఓ ప్రభుత్వ ఉద్యోగి అదే రోజు సోదరి చనిపోయిన బాధలో కూడా తన వృత్తి ధర్మాన్ని నెరవేర్చాడు. ప్రభుత్వం ప్రతీ ఆదివారం 10 గంటల 10 నిమిషాలకు ప్రజలకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించే కార్యక్రమం చేపట్టింది. అంబర్‌పేట శానిటేషన్‌, ఎంటమాలజీ విభాగంలో ఎండ్ల బాబురావు ఎప్పటిలాగే ఆదివారం డ్యూటీకి బయలుదేరాడు. గమ్యం చేరుతుండగా ఆయన సోదరి మృతి చెందినట్లు ఫోన్‌ వచ్చింది. ఆ సమయంలో ఎవరైనా సెలవు తీసుకుని ఇంటికి వెళ్లిపోతారు. ఉద్యోగ ధర్మానికి, కర్తవ్య నిర్వహణకే ప్రాధాన్యం ఇచ్చిన బాబురావు యథావిధిగా విధులకు హాజరయ్యాడు. దుఃఖాన్ని పంటి బిగువున దాచి పెట్టుకుంటూ ఇంటింటికీ తిరిగి దోమల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కరపత్రాలు పంచారు. బాబురావు అంకితభావానికి పలువురు ఆశ్చర్యచకితులయ్యారు.

Updated Date - 2021-12-06T13:10:16+05:30 IST