Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఉద్యోగులకిచ్చిన హామీలను వెంటనే అమలు పరచాలి

రాయచోటి, డిసెంబరు7: మేనిఫెస్టోలో ఉద్యోగులకిచ్చిన హామీలను వెంటనే అమలు పరచాలని మంగళవారం యండపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏపీ ఎన్జీవోలు రాయచోటి తాలూకా యూనిట్‌ కార్యదర్శి వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో 2019లో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు పరచాలని డిమాండ్‌ చేశారు.  ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్య, ఉద్యోగుల సంఘం జిల్లా కన్వీనర్‌ డాక్టర్‌ సునీల్‌కుమార్‌నాయక్‌ , ఏపీ డీఎస్సీ కాంట్రాక్టు పారామెడికల్‌ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర  కన్వీనర్‌ యర్రపురెడ్డి విశ్వనాఽథరెడ్డి, జేఏసీ జిల్లా నాయకుడు గుగ్గిళ్ల రాజేంద్ర, సీహెచ్‌వో భాగ్యలక్ష్మి, సీనియర్‌ అసిస్టెంట్‌ శ్రీనివాసులు, స్టాఫ్‌నర్సు దేవగణే్‌షరెడ్డి, ఏఎన్‌యంలు నిర్మలమ్మ, సుజాత, ఆశాకార్యకర్తలు పాల్గొన్నారు. 


Advertisement
Advertisement