ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

ABN , First Publish Date - 2021-12-08T04:51:42+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యా యులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తుండటాన్ని నిరసిస్తూ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు మంగళవారం కందుకూరులో ఉద్యోగులు, ఉపాధ్యాయులు నిరసన తెలిపారు.

ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
కందుకూరులో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతున్న సబ్‌ కలెక్టర్‌ కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది

ఎన్జీవో నేతల డిమాండ్‌ 

 నల్ల బ్యాడ్జీలతో నిరసన

కందుకూరు, డిసెంబరు 7: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యా యులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తుండటాన్ని నిరసిస్తూ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు మంగళవారం కందుకూరులో ఉద్యోగులు, ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. స్థానిక సబ్‌ కలెక్టర్‌ కార్యాలయ ఉద్యోగులుతో పాటు వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యో గులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై నిరసన తెలిపారు. పలు పాఠశాలల్లో ఉపాధ్యాయులు కూడా నల్ల బ్యాడ్జీలు ధరించి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ తమ హక్కుల సాధన కోసం ఆందోళనలు తీవ్ర తరం చేస్తామని హెచ్చరించారు.

కనిగిరి: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఏపీఎన్జీవో కనిగిరి తాలూకా అధ్యక్షుడు పీవీ రమణారెడ్డి డిమాండ్‌ చేశారు. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు మంగళవారం ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులు నిర్వహించారు. ఈ సందర్భంగా  స్థానిక ఎంపీడీవో కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో రమణారెడ్డి మాట్లాడుతూ వేతన సవరణ కమిటీ సిఫార్సు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, పాత పీఆర్సీ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగుల పొదుపు డబ్బులను కూడ చెల్లించకుండా ఉద్యోగులను నానా ఇబ్బందులకు గురిచేయడం అన్యాయమని విమర్శించారు. 

 పామూరు: మండలంలోని వగ్గంపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. కార్యక్ర మంలో జి శ్రీహరిరావు, డి తిరుపతయ్య, వెంకటసుబ్బయ్య, దావీదు, రఘురామిరెడ్డ, యామిని, కల్పన, సునీత తదితరులు పాల్గొన్నారు. 

లింగసముద్రం: స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో  ఉద్యోగు లు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.  కార్యక్రమంలో ఉద్యోగులు జి.శ్రీనివాసులు, పులి శివరాములు, చెన్నయ్య, శ్యాం, కుమారి, జోగేశ్వ రరావు తదితరులు పాల్గొన్నారు.

వలేటివారిపాలెం: మండలంలోని పోకూరు హైస్కూల్‌లో ప్రభుత్వ తీరుపై ఉపాధ్యాయులు నిరసన తెలిపారు.  ఈ సందర్భంగా ఏపీటీఎఫ్‌ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఏవీ రావు మాట్లాడుతూ సీపీఎస్‌ను రద్దు చేయా లని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో  రవిచంద్ర, కట్టా రమేష్‌, శ్రీను, సుబ్బారావు, చక్రవర్తి, శ్యామల, సుబ్బరత్నమ్మ, సులోచన తదితరులు పాల్గొన్నారు.

ముండ్లమూరు: ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లను తక్షణమే నెరవేర్చాలని మంగళవారం మండలంలోని మారెళ్ళ ఆరోగ్య కేంద్రం వద్ద వైద్యులు, సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. పలు పాఠశాలల ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. మారెళ్ళ వైద్యాధికారి టి.వనజారెడ్డి, ఏఎన్‌ఎంలతో పాటు పలు పాఠశాలల ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించారు. 

దర్శి: పీఆర్‌సీ వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఉద్యోగ సంఘాల నాయకులు మంగళవారం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. కార్యక్రమంలో తహసీ ల్దార్‌ వీడీబీ వరకుమార్‌, ఏఆర్‌ఐ ప్రసన్నకుమారి, ఉద్యోగ సంఘాల నాయకుడు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-08T04:51:42+05:30 IST