ఉపాధి పనులను పరిశీలించిన కేంద్ర బృందం

ABN , First Publish Date - 2022-01-18T05:30:00+05:30 IST

మండలంలోని సిద్దవరం, గోనుపల్లి గ్రామాల్లో జరిగిన ఉపాధిహామీ పనులను సెంట్రల్‌ టీం సభ్యులు రీనాదేశాయి, సంతోష్‌ స్థానిక అధికారులతో కలసి మంగళవారం పరిశీలించారు.

ఉపాధి పనులను పరిశీలించిన కేంద్ర బృందం
సిద్దవరం గ్రామంలో జరిగిన ఉపాదిహామీ పథకం పనులను పరిశీలిస్తున్న సెంట్రల్‌ టీం

రాపూరు, జనవరి 6:  మండలంలోని సిద్దవరం, గోనుపల్లి గ్రామాల్లో జరిగిన ఉపాధిహామీ పనులను సెంట్రల్‌ టీం సభ్యులు రీనాదేశాయి, సంతోష్‌ స్థానిక అధికారులతో కలసి మంగళవారం పరిశీలించారు. మండలంలో జరిగిన ఉపాధిహామీ పనుల్లో అవకతవకలు చోటు చేసుకోవడంతో ముగ్గురిని తాత్కాలికంగా సస్పెన్షన్‌ చేసిన విషయం తెలిసిందే. దీంతో జిల్లాకు వచ్చిన సెంట్రల్‌టీం రాపూరు మండలాన్ని ఎంపికచేసుకున్నట్లు సమాచారం. మండలంలో రెండురోజులపాటు పర్యటించి పూర్తిస్థాయిలో పనులు పర్యవేక్షించనున్నట్లు తెలిసింది. తొలిరోజు రెండు పంచాయతీ పనులు పరిశీలించి నివేదిక తయారుచేసినట్లు సమాచారం. బుధవారం తనిఖీలు కొనసాగుతాయని వినికిడి. తనిఖీలు చేస్తున్న సెంట్రల్‌టీం అధికారులు క్షేత్రస్థాయి వివరాలు సేకరించి జరిగిన పనులను పరిశీలించి వాటిని నివేదిక రూపంలో కేంద్రప్రభుత్వానికి అందిస్తారన్న ప్రచారం సాగుతోంది.


Updated Date - 2022-01-18T05:30:00+05:30 IST