జీతాల్లో కోత... ఉద్యోగులు, ఉపాధ్యాయులు నిరసనలు జూన్ ఒకటిన...

ABN , First Publish Date - 2020-05-29T01:31:30+05:30 IST

ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, పబ్లిక్ సెక్టార్ & కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్యవేదిక రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సమావేశం గురువారం జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం మే నెల వేతనాలు, పెన్షన్లలో కూడా కోత విధించాలని నిర్ణయించటాన్ని సమావేశం తీవ్రంగా ఖండించింది.

జీతాల్లో కోత... ఉద్యోగులు, ఉపాధ్యాయులు నిరసనలు జూన్ ఒకటిన...

హైదరాబాద్ : ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, పబ్లిక్ సెక్టార్ & కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్యవేదిక రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సమావేశం గురువారం జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం మే నెల వేతనాలు, పెన్షన్లలో కూడా కోత విధించాలని నిర్ణయించటాన్ని సమావేశం తీవ్రంగా ఖండించింది.


వరుసగా మూడో నెల కూడా కోతలు అమలు చేయటంవలన లక్షలాది కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులకు లోనవుతాయని ఐక్యవేదిక ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలన్నీ ఐక్యమై ప్రభుత్వ చర్యలను ప్రతిఘటించలేక పోవటమే ఈ దుస్థితికి కారణమన్నారు. అందుకు ప్రధాన బాధ్యత టీఎన్జీవో, టీజీఓ సంఘాల నాయకులదేనని సమావేశం అభిప్రాయపడింది.


ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల విజ్ఞప్తులను పట్టించుకోకుండా వరుసగా మూడవ నెల కూడా *వేతనాలు, పెన్షన్లలో కోత విధించటాన్ని నిరసిస్తూ జూన్ ఒకటిన ఉదయం 10.30 - 11.30 గంటల వరకు జిల్లా కలెక్టర్ కార్యాలయాలు, ముఖ్యమైన పట్టణ కేంద్రాల్లో ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలను నిర్వహించాలని ఐక్యవేదిక నిర్ణయించింది. 

Updated Date - 2020-05-29T01:31:30+05:30 IST