ఎన్నికల డ్యూటీ తప్పించుకునేందుకు అధికారుల వింత కారణాలు

ABN , First Publish Date - 2021-04-13T12:47:56+05:30 IST

యూపీలోని మీరట్‌లో పంచాయతీ ఎన్నికల నామినేషన్...

ఎన్నికల డ్యూటీ తప్పించుకునేందుకు అధికారుల వింత కారణాలు

మీరట్: యూపీలోని మీరట్‌లో పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. ఇది ఈనెల 15 వరకూ కొనసాగనుంది. 26న ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి 10 వేలకుపైగా సిబ్బందికి అధికారులు శిక్షణ ఇస్తున్నారు. అయితే ఎన్నికల డ్యూటీని తప్పించుకునేందుకు పలువురు వింతవింత కారణాలు చెబుతున్నారు. కొందరు పెళ్లికి వెళ్లాల్సి ఉందని చెబుతుండగా, మరికొందరు అనారోగ్య కారణాలు చెబుతూ సెలవులు అడుగుతూ, ఎన్నికల బాధ్యతల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 


ఈ సందర్భంగా డీపీఆర్ఓ మాట్లాడుతూ అనారోగ్య కారణాల చెబుతూ లీవు కోరుతున్నవారి గురించి ఆరా తీయగా వారు పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని తెలిసిందన్నారు. అందుకే అనారోగ్యం పేరుతో సెలవు అడుగుతున్నవారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. అయితే ఎన్నికల రోజున సిబ్బంది ఎవరైనా విధులకు హాజరుకాకుంటే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే పెళ్లి పేరుతో సెలవులు అడుగుతున్న వారి విషయంలో పలు నిబంధనలు విధిస్తున్నామన్నారు. వారి ఇంట్లో వివాహం ఉంటేనే సెలవు మంజూరు చేస్తున్నామన్నారు.

Updated Date - 2021-04-13T12:47:56+05:30 IST