ఉద్యోగుల పోరుబాట

ABN , First Publish Date - 2021-12-08T04:55:04+05:30 IST

ప్రభుత్వ ఉద్యోగులు మూకుమ్మడిగా రోడ్డెక్కారు. పలు డిమాండ్లతో ఆందోళనకు దిగారు.

ఉద్యోగుల పోరుబాట
సాధించే వరకూ పోరాటం : ఆకివీడు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నినాదాలు చేస్తున్న ఉద్యోగులు

డిమాండ్ల సాధనకు ఐక్యంగా ఉద్యమం

రోడ్డెక్కిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు

నల్లబ్యాడ్జీలతో నిరసన ప్రదర్శన


ప్రభుత్వ ఉద్యోగులు మూకుమ్మడిగా  రోడ్డెక్కారు. పలు డిమాండ్లతో ఆందోళనకు దిగారు. కరువు భత్యం 5 వాయిదాలు, ఫ్రీజింగ్‌లో ఉన్న 2 డీఏలు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌, సీపీఎస్‌ రద్దు, ఔట్‌ సోర్సింగ్‌, ఒప్పంద ఉద్యోగుల వేతనాల పెంపు, వైద్య శాఖలో జీవో 64, 143 రద్దు, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను రెగ్యులర్‌ ఉద్యోగులుగా పరిగణించ డం, ఆర్‌టీసీ ఉద్యోగు లకు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు రావలసిన రాయితీలు, హక్కులు కల్పించాలని, విద్యాశాఖలో ఉమ్మడి సర్వీస్‌ రూల్స్‌ అమలు తదితర డిమాండ్లతో ఆందోళనకు దిగారు. మంగళవారం నుంచి గురువారం వరకూ నల్ల బ్యాడ్జిలతో నిరసన వ్యక్తం చేస్తూ విధులకు హాజరై భోజన విరామ సమయంలో ఆందోళన చేయాలని నిర్ణయించారు. 


పాలకొల్లు అర్బన్‌, డిసెంబరు 7 : ప్రభుత్వ ఉద్యోగుల పాలకొల్లు జేఏసీ నాయకులు సమస్యల పరిష్కారానికి ఉద్యమ కార్యాచరణ ప్రణాళిక రూపొందిం చారు. అమరావతి ఏపీజేఏసీ పిలుపు మేరకు ఐక్య ఉద్యమ కార్యా చరణ రూపొందించినట్టు పాలకొల్లు జేఏసీ చైర్మన్‌ గుడాల హరిబాబు, కన్వీనర్‌ వేగేశ్న మురళీకృష్ణం రాజు తెలిపారు.మంగళవారం నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరై నిరసన తెలిపారు.సీటీవో కేవీ శ్రీనివాసరావుకు వినతిపత్రం అందించారు. 


నరసాపురం : డిమాండ్ల పరిష్కారానికి ఏపీ ఎన్జీవోల ఆధ్వర్యంలో మంగళ వారం పట్టణంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. భోజన విరామ సమయంలో కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. మొగల్తూరు పీహెచ్‌సీలో తాలూకా అధ్యక్షుడు ఆర్‌.కృష్ణకుమార్‌, కార్యదర్శి ఎం.రామసుబ్బారావు ఆధ్వర్యంలో సబ్‌కలెక్టర్‌ కార్యాలయం, శేషు ప్రసాద్‌ ఆధ్వర్యంలో తహసీల్దార్‌ కార్యాలయం,మురళి ఆధ్వర్యంలో  రెవెన్యూ, ట్రజరీ, సబ్‌ రిజిస్ర్టార్‌  కార్యా లయాల వద్ద  సిబ్బంది  నిరసన తెలిపారు. 


ఆచంట : జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు సమస్యల పరిష్కారానికి ఆందోళన చేశారు.ఉపాధ్యాయులు లంచ్‌అవర్‌లో  మంగళవారం నల్లబ్యాడ్జీలు పెట్టుకుని   నిరసన తెలిపారు. డిమాండ్లు నెరవేర్చాలని ఉపాధ్యాయులు డిమాండ్‌ చేశారు. 


పాలకోడేరు :  పాలకోడేరు మండల ఉద్యోగులు మంగళవారం నిరసన తెలిపారు. ప్రభుత్వం ఉద్యోగుల పట్ల నిర్లక్ష్య భావం విడనాడాలని, సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఉద్యోగులు విజయరామరాజు, సూర్యనారాయణ, సీతారామరాజు, శ్యామలరావు, రంగరాజు తదితరులు పాల్గొన్నారు. 


ఆకివీడు : ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని జేఏసీ సభ్యుడు వెంకటేశ్వరరావు అన్నారు. స్థానిక జిల్లా పరిషత్‌ బాలురు ఉన్నత పాఠశాలలో మంగళవారం ఉపాధ్యాయులు నల్లరిబ్బన్లు ధరించి విధులకు హాజరై నిరసన తెలిపారు. సకాలంలో జీతాలు చెల్లించాలన్నారు.  


ఆకివీడురూరల్‌ :  సమస్యలు పరిష్కరించాలంటూ ఏపీ జేఏసీ పిలుపు మేరకు మంగళవారం ఉద్యోగులు మధ్యాహ్నం భోజన విరామ సమయంలో తమ కార్యాలయాల వద్ద నల్లరిబ్బన్లు ధరించి నిరసన ప్రదర్శన చేశారు. ఆకి వీడు మండలంలోని పాఠశాలలు, కార్యాలయాలు వద్ద నిరసన తెలిపారు. 


వీరవాసరం : రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు మంగళవారం వీరవాసరం, రాయకుదురు, అండలూరు, తోలేరు, జడ్పీహైస్కూల్‌ వద్ద నల్లరిబ్బన్లు ధరించి ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో యూటీఎఫ్‌ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె.నాగమునేశ్వరరావు,ఎన్‌ఎంసీహెచ్‌ శ్రీనివాసరావు, దేవిరెడ్డి పుల్లారావు, పంపన సా యిబాబు, అంగర వేణు, పి.హరేకృష్ణ, ఎన్‌.రవికిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.  


యలమంచిలి : ఉపాధ్యాయులు మంగళవారం నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. 11వ పీఆర్‌సీ అమలు చేయాలని, సీపీఎస్‌ను రద్దు చేయాలని, డీఏ బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.  


పెనుమంట్ర  : సీఎం జగన్‌ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని ఏపీటీఎఫ్‌ అధ్యక్షుడు పాలా ప్రసాద్‌ ఆరోపించారు. ఉపాధ్యాయ  జేఏసీ పిలుపు మేరకు మంగళవారం ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై  నిరసన తెలిపారు.కార్యక్రమంలో అంబటి సత్యనారాయణ, కండిబోయిన రాంబాబు, నాగేంద్ర, బండి ఆంజనేయులు, తాతయ్య, దొంగ సత్యనారాయణ, కర్రి లక్ష్మణ్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


భీమవరంటౌన్‌ : రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు తాలూకా ఆఫీస్‌ పెన్షనర్స్‌ అసోసియేషన్‌ భవనం వద్ద పెన్షనర్స్‌, ట్రెజరీ కార్యాలయ సిబ్బంది నల్లరిబ్బన్లతో నిరశన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో పెన్షనర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు జి.జేమ్స్‌, యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి, జేఏసీ జిల్లా కో– చైర్మన్‌ బి గోపిమూర్తి, ట్రెజరీ అసోసియేషన్‌ జిల్లా అద్యక్షుడు యువి.పాండురంగారావు, ఎస్‌టీవో వర్మ, నాయకులు శోభన్‌, భాస్కరరావు, సత్యనారాయణ, సీతారామరాజు, విజయరామరాజు, సూర్యనారాయణ, శ్యామలరావు పాల్గొన్నారు. 



Updated Date - 2021-12-08T04:55:04+05:30 IST