మోగిన ఉద్యోగుల సమ్మె సైరన్‌

ABN , First Publish Date - 2022-01-25T05:26:10+05:30 IST

ఉద్యోగుల సమ్మె సైరన్‌ మోగింది. పీఆర్సీ సాధన సమితి పేరుతో వివిధ సంఘాలు సంయుక్తంగా రాష్ట్రస్థాయిలో ఏర్పడిన కమిటీ ప్రతినిధులు సోమవారం సాయంత్రం ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చారు. జిల్లాలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు తదనుగుణ చర్యలపై దృష్టిసారించారు. రివర్స్‌ పీఆర్సీ మాకొద్దు అంటూ ఇప్పటికే ఉపాధ్యాయ సంఘాలు రోడ్డెక్కి ఆందోళనకు దిగారు.

మోగిన ఉద్యోగుల సమ్మె సైరన్‌

 ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చిన రాష్ట్రనేతలు

తదనుగుణంగా కార్యక్రమాలపై జిల్లా నే తలు దృష్టి

నేడు ఒంగోలులో మహాధర్నా

50వేల మందికిపైగా పాల్గొనే అవకాశం

ఒంగోలు, జనవరి 24 (ఆంధ్రజ్యోతి) : ఉద్యోగుల సమ్మె సైరన్‌ మోగింది. పీఆర్సీ సాధన సమితి పేరుతో వివిధ సంఘాలు సంయుక్తంగా రాష్ట్రస్థాయిలో ఏర్పడిన కమిటీ ప్రతినిధులు సోమవారం సాయంత్రం ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చారు.  జిల్లాలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు తదనుగుణ చర్యలపై దృష్టిసారించారు.  రివర్స్‌ పీఆర్సీ మాకొద్దు అంటూ ఇప్పటికే ఉపాధ్యాయ సంఘాలు రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. సమ్మెలో దిగేందుకు రెండు వారాల సమయం ఉండగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగులను సమాయత్తం చేసేందుకు ఈలోపు పలు రూపాల్లో ఆందోళనకు పిలుపునిచ్చారు. తదనుగుణంగా జిల్లాలో ఉన్న 50వేల మంది ఉద్యోగులతో పాటు వేలాదిగా ఉన్న పెన్షనర్లు అందరినీ ఉద్యమ పధాన నడిపించేందుకు ఆయా సంఘాల నేతలు సన్నాహాలు చేస్తున్నారు. ఆదివారం ఒంగోలులో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించి సమ్మెకు కార్యచరణను రూపొందించారు. మంగళవారం ఒంగోలులోని కలెక్టరేట్‌ వద్ద మహాఽధర్నాకు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా వేలాది మంది ఈ ధర్నాకు రానున్నట్లు సమాచారం. అలాగే 26న రిపబ్లిక్‌డే సందర్భంగా అన్ని పాత తాలూకా కేంద్రాల్లో అంబేడ్కర్‌ విగ్రహాలకు వినతిపత్రాలు ఇవ్వడంతో పాటు 27నుంచి 30వరకు జిల్లాకేంద్రంలో రిలేదీక్షలు చేపట్టనున్నారు. కాగా జిల్లాలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు పాల్గొని కార్యక్రమాలు విజయవంతం చేయాలని జేఏసీ నేతలు శరత్‌బాబు, కృష్ణమోహన్‌లు కోరారు. 


Updated Date - 2022-01-25T05:26:10+05:30 IST