ఉపాధి హామీ కూలీల చెల్లింపులు ఆలస్యం చేస్తే కఠిన చర్యలు

ABN , First Publish Date - 2020-05-02T10:56:17+05:30 IST

ప్రతి మండలంలో ఉపాధి హామీలో చేయాల్సిన పని దినాలకు ప్రణాళికలు సిద్థంచేసుకుని పనులు ప్రారంభించి నిర్దేశించిన సమయంలో పూర్తి చేయాలని జిల్లా

ఉపాధి హామీ కూలీల చెల్లింపులు ఆలస్యం చేస్తే కఠిన చర్యలు

  • జిల్లా కలెక్టర్‌ కె శశాంక్

కరీంనగర్‌ , మే 1 (ఆంధ్రజ్యోతి, ప్రతినిధి): ప్రతి మండలంలో ఉపాధి హామీలో చేయాల్సిన పని దినాలకు ప్రణాళికలు సిద్థంచేసుకుని పనులు ప్రారంభించి నిర్దేశించిన సమయంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ కె శశాంక అన్నారు. శుక్రవారం వివిధ మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఏపీవోలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2020-21 ఆర్థిక సంవత్సరంలో ప్రతి మండలంలో చేయాల్సిన పని దినాలను కమిషనర్‌ పంచాయతీ రాజ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ హైదరాబాద్‌ వారు నిర్దేశించారని జిల్లాలో (మానకొండూర్‌, జమ్మికుంట, గంగాధర, ఇల్లందకుంట, కరీంనగర్‌) మండలాలు పనుల నిర్వహణలో వెనుకబడి ఉన్నాయన్నారు. ఈ మండలాల అధికారులు తప్పకుండా ప్రతి గ్రామంలో 200 మందికంటే ఎక్కువ మంది కూలీలు పనికి వచ్చేటట్లు చూడాలని ఆదేశించారు.


పనికి వచ్చిన కూలీలకు వారి బ్యాచ్‌ ప్రకారం మూడు రోజుల లోపు పేమెంట్‌ చేయాలని ఆదేశించారు. ప్రతి మండలంలో రోజు వారీగా రిపోర్టు చేసిన కూలీలకు పేమెంట్‌ చేసిన కూలీలకు తేడా ఉంటుందని ఈ గ్యాప్‌ ఎక్కడ ఉందోచూసుకొని చెల్లింపులు చేయాలన్నారు. ప్రతి గ్రామ పంచాయతీ యందు కూలీలు పనిచేయడానికి వీలుగా పనులు 200 శాతం ఉండాలని దానికొరకు పనులను గుర్తించి పరిపాలన మంజూరు తీసుకోవాలని ఆయన సూచించారు. ప్రతి గ్రామ పంచాయతీ గ్రీన్‌ప్లాన్‌ యాక్షన్‌ ప్రకారం మొక్కలు అందుబాటులో ఉన్నాయో లేదో చూసుకోవాలన్నారు. జెర్మినేషన్‌ రాని పాలిధిన్‌ సంచులలో లోకల్‌లో అందుబాటులో దొరికే విత్తనాలను పెట్టాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జెడ్పీ సీఈవో వెంకటమాధవరావు, జిల్లా గ్రామీణ అభివృద్థి అధికారి శ్రీధర్‌, జిల్లా పంచాయతీ అధికారి రఘువరన్‌ ఎపీడీ మంజులాదేవి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-05-02T10:56:17+05:30 IST