Abn logo
Sep 27 2021 @ 23:32PM

మేక్‌పమెన్లకు ఉపాధి అవకాశాలు

మేక్‌పలో శిక్షణ పొందుతున్న విద్యార్థులు

కడప(వైవీయూ), సెప్టెంబరు 27: మేకప్‌మెన్లకు అటు సినీరంగంలో, ఇటు నాటక రంగంలో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఉస్మానియా యూనివర్శిటీ రంగస్థల విభాగం విశ్రాంత అధ్యాపకుడు ప్రొఫెసర్‌ ప్రసాద్‌రెడ్డి అన్నారు. వైవీయూ లలితకళల విభాగం సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఏడు రోజులపాటు ‘మేకప్‌, వస్త్రధారణ’ అనే అంశంపై లైబ్రరీలో వర్క్‌షా్‌పను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసాద్‌రెడి ్డ మాట్లాడారు. కార్యక్రమంలో లలిత కళల విభాగం కోఆర్డినేటర్‌ మూల మల్లికార్జునరెడ్డి, ప్రొఫెసర్‌ రాంప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.