ఉపాధి బాట

ABN , First Publish Date - 2021-03-01T05:53:06+05:30 IST

వేసవి ప్రారంభం కావడంతో వ్యవసాయ పనులు ముగించు కొని కూలీలు ఉపాధి బాట పడుతున్నారు. వారం రోజులుగా జిల్లాలో ఉపాధి పనులు చేసే కూలీల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

ఉపాధి బాట

తగ్గుముఖం పట్టిన వ్యవసాయ పనులు

వేసవిలో ప్రత్యేక భత్యం చెల్లింపులు

గ్రామ కార్యదర్శులపై పెరుగుతున్న పనిభారం

ఈ యేడు 69లక్షల పని దినాల లక్ష్యంగా ముందుకు

జిల్లాలో ఊపందుకుంటున్న ఉపాధి పనులు

ఆదిలాబాద్‌, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): వేసవి ప్రారంభం కావడంతో వ్యవసాయ పనులు ముగించు కొని కూలీలు ఉపాధి బాట పడుతున్నారు. వారం రోజులుగా జిల్లాలో ఉపాధి పనులు చేసే కూలీల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం రోజు కూలీ గరిష్ఠంగా రూ.237 చెల్లిస్తుండగా వేసవిలో అదనపు భత్యం చెల్లిస్తారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లాలో 69లక్షల పనిదినాలను లక్ష్యంగా పెట్టు కొని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇప్పటి వరకు 51లక్షల పనిదినాలను పూర్తి చేశారు. మిగిలిన పని దినాలను మార్చి, ఏప్రిల్‌, మేలో పూర్తయ్యే విధం గా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం రోజుకు జిల్లా వ్యా ప్తంగా 12వేల 914మంది కూలీలు ఉపాధి పనులు చేస్తున్నారు. జిల్లాలో మొత్తం జాబ్‌కార్డులో లక్షా 63వేల 595 ఉండగా వీటి పరిధిలో లక్షా 80వేల 832 మంది కూలీలున్నారు. జిల్లా వ్యాప్తంగా 94వేల 650 కుటుంబాలు ఉపాధి పనులుచేస్తున్నాయి. ఇప్పటి వరకు వంద రోజులు పని దినాలను పూర్తి చేసుకున్న కుటుంబాలు 10వేల605 ఉన్నాయి. మునుపెన్నడూ లేనివిధంగా ఈ ఆర్థిక సంవత్సరంలో కరోనా పరిస్థితు లు ఎదురు కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక పని దినాలను పూర్తి చేసిన జిల్లాగా రాష్ట్ర అధికారుల చేత జిల్లా గుర్తింపు పొందింది. జిల్లాలో 467 గ్రామ పంచాయతీలు ఉండగా అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో ఉపాధి పనులు ఊపందుకుంటున్నాయి. ప్రస్తుతం సగటున రోజుకు 28 మంది ఉపాధి పనుల కు వస్తున్నట్లు అధికారిక లెక్కల ప్రకారం తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఉపాధి పనులు ఊపందుకున్న నేపథ్యంలో ఆయా ప్రదేశాల్లో పనుల ను  గుర్తించి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.

తగ్గుముఖం పట్టిన యాసంగి సాగు..

జిల్లాలో ప్రధానంగా ఖరీఫ్‌ సీజన్‌లోనే అధికంగా పంటలను సాగు చేస్తుంటారు. నీటి వసతి అంతంత మాత్రంగా ఉండడంతో యాసంగిలో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గుతోంది. దీంతో ప్రత్యామ్నయ ఉపాధి వైపు కూలీలు మొగ్గు చూపుతున్నారు. ఉద యం వేళల్లో కూలీ పనులు చేస్తూ మధ్యాహ్నం, సా యంత్రం వేళల్లో సాగు పనులకు పరిమితమవు తున్నారు. ఇప్పటి వరకు 54శాతం పని దినాలను పూర్తి చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. వచ్చే మార్చి, ఏప్రిల్‌, మేలో ఉపాధి పనులు మరింతగా ఊ పందుకునే అవకాశం ఉందంటున్నారు. కరోనా నేప థ్యంలో వలస కూలీలకు పని కల్పించాలనే ఉద్దేశంతో గతేడాది కంటే ఈ సంవత్సరం పని దినాలను రెట్టింపు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. 

అదనపు చెల్లింపులు..

వేసవిలో ఉపాధి కూలీలకు అదనపు భత్యం చెల్లిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే దీనికి సంబంధించిన విధి విధానాలు జిల్లా అధికారులకు అందాయి. ఫిబ్రవరిలో కూలీపై 20శాతం చెల్లించగా మార్చిలో 30శాతం, ఏప్రిల్‌, మేలో 20శాతం, జూన్‌లో 20 అదనపు భత్యాన్ని చెల్లిస్తారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఒక్కో పంచాయతీ పరిధిలో సగటున 20 నుంచి 30 మంది చొప్పున ఉపాధి పనులకు కూలీలు హాజ రవుతున్నారు. మార్చిలో కూలీల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికా రులు అంచనా వేస్తున్నారు. ప్రస్థుతం రోజుకు 12914 మంది కూలీలు వస్తుండగా మార్చి మొదటి వారంలోనే 30వేలకు పైగా కూలీల సంఖ్య నమోదయ్యే అవకాశం ఉందం టున్నారు. దీంతో పని ప్రదేశాలలో నీటి వసతితో పాటు నీడసౌకర్యాన్ని కల్పిస్తున్నారు.

గ్రామ పంచాయతీలదే బాధ్యత..

ఉపాధి పనులను పర్యవేక్షించాల్సిన బాధ్యత పూర్తి గా గ్రామ పంచాయతీలపైనే ఉన్నది. ఉద్యోగ భద్రత కల్పించాలని ఆందోళన చేపట్టిన ఫీల్డ్‌ అసిస్టెంట్‌లను విధుల నుంచి తొలగించిన విషయం తెలి సిందే. దీంతో గ్రామాల్లో ఉపాధి పనుల పర్యవేక్షణ బాధ్యతను గ్రామ పంచాయ తీలకు అప్పగించారు. ప్రస్తుతం గ్రామ పంచా యతీ కార్యదర్శి పనులపై పర్యవేక్షణ చేపడుతున్నారు. అలాగే అందుబాటులో ఉన్న టెక్నికల్‌ అసిస్టెంట్‌ల సేవలను సద్వినియోగం చేసుకుంటున్నారు. పను ల గుర్తింపు, కూలీలకు వస తులను కల్పించడం తదితర విషయాలను గ్రామ సర్పంచ్‌, కార్యదర్శులకే అప్పగిం చారు. జిల్లాలోని 467 గ్రామ పంచా యతీలకు గాను అన్ని గ్రామ పంచాయ తీలలో యథావిధిగా పనులు జరుగుతున్నాయి. కూలీ డబ్బులు కూడా సకాలంలోనే అందే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. కానీ కొన్ని గ్రామా లలో సర్పంచ్‌ల పెత్తనం పెరిగి పోవడం, పనులపై కార్యదర్శులకు అవగాహన లేకపోవడం, పనిభారం పెరిగి పోవడంతో అక్కడక్కడ కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జిల్లా, మండల ప్రత్యేకాధికారులు తరచుగా పనులను పర్యవేక్షిస్తూ సమస్యల పరిష్కారం దిశగా కృషి చేస్తున్నారు. అయినా రెండు  మూడు మాసాలకోసారి కూలీ డబ్బులు చెల్లించే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

Updated Date - 2021-03-01T05:53:06+05:30 IST