కొలతల ప్రకారం ఉపాధి పనులు చేయాలి

ABN , First Publish Date - 2020-05-30T11:03:04+05:30 IST

ఉపాధి పనులను కూలీలం దరూ కొలతల ప్రకారం చేస్తేనే రోజుకు రూ.237 గి ట్టుబాటు కూలి వస్తుందని

కొలతల ప్రకారం ఉపాధి పనులు చేయాలి

మాచారెడ్డి, మే 29: ఉపాధి పనులను కూలీలం దరూ కొలతల ప్రకారం చేస్తేనే రోజుకు రూ.237 గి ట్టుబాటు కూలి వస్తుందని డీఆర్‌డీవో చంద్రమోహ న్‌రెడ్డి అన్నారు. మాచారెడ్డిలో శుక్రవారం పంచాయ తీ కార్యదర్శులకు, ఉపాధిహామీ సిబ్బందితో నిర్వ హించిన సమీక్షా సమావేశానికి హాజరై మాట్లాడారు. గ్రామాల్లో, అటవీ ప్రాంతా ల్లో ఏఏ పనులు చేస్తున్నారని, ఎంత మంది కూలీలు పని చేస్తున్నారని, కూలీ లకు డబ్బులు అందుతున్నాయా? అని అడిగి తెలుసుకున్నారు.


ఎన్ని మొక్కల కు ప్లాంటేషన్‌లను ఏర్పాటు చేశారు, ఎన్ని మొక్కలు నాటారు? నీరు పోస్తు న్నారా? అని అడిగి తెలుకున్నారు అనం తరం మంథనిదేవునిపల్లి గ్రామంలో ఉ పాధి పనులను పరిశీలించారు. ఉపాఽఽధి పనులపై నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏపీ డీ శ్రీకాంత్‌, ఎంపీడీవో బాలకృష్ణ, ఎంపీవో లక్‌పతి నాయక్‌, ఏపీవో హరిబాబు, పీఆర్‌ఏఈ వెంకటేష్‌, సూపరింటెండెంట్‌ ప్రమోద్‌కుమార్‌, శ్రీధర్‌, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-05-30T11:03:04+05:30 IST