ఉపాధి సిబ్బందికి వ్యాక్సిన్‌ వేయించాలి

ABN , First Publish Date - 2021-04-21T09:53:18+05:30 IST

ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న 20 వేల మంది సిబ్బందిని ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌గా గుర్తించి, వారందరికీ వ్యాక్సిన్‌ ఇప్పించాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌ గిరిజాశంకర్‌ ఆదేశించారు.

ఉపాధి సిబ్బందికి వ్యాక్సిన్‌ వేయించాలి

  • పంచాయతీరాజ్‌  కమిషనర్‌ గిరిజాశంకర్‌ ఆదేశం

అమరావతి, ఏప్రిల్‌ 20(ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న 20 వేల మంది సిబ్బందిని ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌గా గుర్తించి, వారందరికీ వ్యాక్సిన్‌ ఇప్పించాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌ గిరిజాశంకర్‌ ఆదేశించారు. డ్వామా పీడీలు, ఏపీడీలతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ ఎఫ్‌ఏలు, టీఏలు, సీవోలు, ఈసీలు, ఏపీవోలు, ఏపీడీలు, అడిషనల్‌ పీడీలందరికీ వ్యాక్సినేషన్‌ అయ్యేలాగా పీడీలు బాధ్యత తీసుకోవాలన్నారు. రెండు డోస్‌ల వ్యాక్సిన్‌ పూర్తి చేయించాలన్నారు. పని కొలతలు తీసేటప్పుడు, ఎంబుక్‌ రికార్డు చేసేటప్పుడు భౌతికదూరం పాటించాలని, కార్యాలయంలోకి సాధ్యమైనంత వరకు సందర్శకులను అనుమతించొద్దన్నారు. ఉపాధి పనులకు ఈ మూడు నెలలు చాలా కీలకమైనవని, రోజుకు 50 లక్షల కూలీలు పనికి హాజరయ్యేలా చూడాలని, జాబ్‌కార్డులోని కుటుంబ సభ్యులందరూ పనిలోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Updated Date - 2021-04-21T09:53:18+05:30 IST