కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ‘ఉపాధి’ పనులు చేపట్టాలి

ABN , First Publish Date - 2021-05-11T06:02:11+05:30 IST

జిల్లాలో రోజు రోజుకూ విజృంభిస్తున్న కరోనా నేపథ్యంలో ఉపాధి పనులు నిర్వహిస్తున్న కూలీలు కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ పథకం పనులను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్‌ ఎం.డేవిడ్‌ అన్నారు.

కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ‘ఉపాధి’ పనులు చేపట్టాలి
కంటంలో కూలీలతో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ డేవిడ్‌

జైనథ్‌, మే10: జిల్లాలో రోజు రోజుకూ విజృంభిస్తున్న కరోనా నేపథ్యంలో ఉపాధి పనులు నిర్వహిస్తున్న కూలీలు కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ పథకం పనులను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్‌ ఎం.డేవిడ్‌ అన్నారు. సోమవారం మండలలోని కంఠం, నిరాల గ్రామాల్లో గల ఈజీఎస్‌ పనులను నర్సరీ నిర్వహణ అధికారులతో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి కాలంలో పనులు లేని వారు కూలీలు, రైతులు ఈ పథకాన్ని వినియోగించుకోవాలన్నారు. ఈజీఎస్‌ ద్వారా జరిగే ప్రతి పనిని నాణ్యతతో చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో గజానన్‌రావ్‌, ఎంపీవో సీహెచ్‌ జగ్గేరావ్‌రాథోడ్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌లు రాజు, రాంశేఖర్‌గౌడ్‌, గ్రామ సర్పంచ్‌ వైద్యబాలాజి, ప్రభాకర్‌లతో పాటు కంఠం, నిరాల కూలీలు పాల్గొన్నారు.

ఉపాది పనుల పరిశీలన..

ఉట్నూర్‌: ఉట్నూర్‌ గ్రామ పంచాయతీ పరిధిలో నిర్వహిస్తున్న ఉపాధి హామీ పనులను సోమవారం గ్రామ పంచాయతీ ఇన్‌చార్జి ఈవో ఉప్పుల సత్యనారాయణ పరిశీలించారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పనులు చేయాలన్నారు.

తలమడుగు: ఉపాధి హామీ పథకంలో కూలీలకు పని కల్పించడమేకాకుండా రైతుల వ్యవసాయ పొలాల్లో పనులను చేయించడం జరుగుతుందని ఎంపీడీవో రమాకాంత్‌ అన్నారు. సోమవారం మండలంలోని లక్ష్మింపూర్‌ అటవీ ప్రాంతంలో ఉపాధి హామీ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ ఉపాధి హామీ పథకాన్ని అర్హులైన రైతులందరు ఉపయోగించుకొని తమ వ్యవసాయ పొలాల్లో కాల్వలు, రాళ్లకట్టలు ముళ్ల పొదల తొలగింపు పనులను చేయించుకోవాలన్నారు. అంతేకాకుండా వ్యవసాయ పొలాలకు వెళ్లేందుకు ఉపాధి హామీ పథకం ద్వారా లింకు రోడ్లను నిర్మించుకోవచ్చని సూచించారు. ఉపాధి హామీ పథకంలో ఎలాంటి అక్రమాలకు తావివ్వకుండా కూలీలే పకడ్బందీగా చర్యలు చేపట్టాలని సూచించారు. ఉపాధి హామీ పనికి వచ్చే కూలీలందరికి సకాలంలో డబ్బులు అందే విధంగా చూడాలని పేర్కొన్నారు. ఇందులో ఏపీవో శ్యాముల్‌, లక్ష్మింపూర్‌ సర్పంచ్‌ రాధామనోహార్‌, పంచాయతీ సెక్రటరీ అనిల్‌రెడ్డి, ఈసీగంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-11T06:02:11+05:30 IST