ఉప్పెనలా.. కదిలారు

ABN , First Publish Date - 2022-01-26T06:20:50+05:30 IST

ఉద్యో గులు కదంతొక్కారు. జిల్లా నలుమూలల నుంచి ఉద్యోగ, ఉపాధ్యాయలు భారీగా గుంటూరుకు తరలివచ్చారు.

ఉప్పెనలా.. కదిలారు
గుంటూరులో జరిగిన ర్యాలీలో పాల్గొన్న ఉపాధ్యాయులు

భారీగా తరలివచ్చిన ఉద్యోగులు

నిరసన ప్రదర్శన.. కలెక్టరేట్‌ వద్ద ధర్నా

రివర్స్‌ పీఆర్సీ సిగ్గుసిగ్గు అంటూ నినాదాలు

నేడు అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రాల సమర్పణ


గుంటూరు(తూర్పు), జనవరి 25: ఉద్యో గులు కదంతొక్కారు. జిల్లా నలుమూలల నుంచి ఉద్యోగ, ఉపాధ్యాయలు భారీగా గుంటూరుకు తరలివచ్చారు. స్థానిక వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుంచి కలెక్టరేట్‌ వరకు భారీ ప్రదర్శన చేశారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో కలెక్టరేట్‌ ప్రాంగణం దద్దరిల్లింది. పీఆర్సీ  సాధ న సమితి పిలుపు మేరకు మంగళవారం చేప ట్టిన ప్రదర్శన, ధర్నా కార్యక్రమాలు విజయవం తంగా జరిగాయి. నాలుగు జేఏసీలతోపాటు, కాం ట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ కార్మికులు, గ్రామ, వార్డు సచివాలయాలు, పెన్షనర్లు, మున్సిపల్‌ వర్కర్లు, ప్రజా, కార్మిక తదితర 55 యూనియన్లకు చెంది న నాయకులు, కార్మికులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలోకదిలివచ్చారు. ఉద యం 10.30 గంట లకు వెంకటేశ్వర విజ్ఞానమందిరం నుంచి మొద లైన ర్యాలీ 11.15 గం టలకు కలెక్టరేట్‌ వద్దకు చేరుకుంది. ఈ సం దర్భంగా రివర్స్‌ పీఆర్సీ సిగ్గు సిగ్గు.. న్యాయం అడిగితే కేసులా, దివాళ కోరు అర్ధరాత్రి జీవో లను వెనక్కి తీసుకోవాలి.. అం టూ ఉద్యోగులు నినాదాలు చేశారు. ధర్నా సమ యంలో ఉప సభాపతి కోన రఘుపతి వాహనం అటుగా రాగా ఉద్యోగులు నినాదాలు ఆపి ఆయన కాన్వాయ్‌కు దారి ఇచ్చారు.


కమిటీతో ప్రయోజనం శూన్యం

ఉద్యోగుల డిమాండ్లపై చర్చలకు ప్రభుత్వం నియమించిన మంత్రుల కమిటీ వల్ల ఎటు వంటి ప్రయోజనం లేదని ఎమ్మెల్సీ లక్ష్మణరావు తెలిపారు. కలెక్టరేట్‌ వద్ద జరిగిన ధర్నాలో ఆయన ప్రసంగిస్తూ    ఇందిరాగాంధీ, ఎన్టీఆర్‌, జయలలిత వంటి వారే ఉద్యోగుల పోరాటాలకు దిగివచ్చారని గుర్తుచేశారు. సమ్మె అంటే ఒకటి రెండు రోజులు కాదని ఈసారి రెండు నెలలైన చేయాలని పిలుపునిచ్చారు. అమరావతి జేఏసీ జిల్లా చైర్మన్‌ సంగీతరావు మాట్లాడుతూ పాద యాత్రలో ముఖ్యమంత్రి చెప్పిన మాటలు నమ్మి మోసపోయామన్నారు. ప్రభుత్వ ఉద్యో గుల సంఘం జిల్లా అధ్యక్షుడు సయ్యద్‌ చాంద్‌ బాషా మాట్లాడుతూ తొలిసారిగా పీఆర్సీ రద్దు కోసం ఉద్యమించాల్సి గతి పట్టిందన్నారు. ఉద్యో గుల సంఘ ఫెడరేషన్‌ జిల్లా అధ్యక్షుడు భాస్క రరెడ్డి మాట్లాడుతూ జీతాలు తగ్గించడమే గాక సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారాలు చేయ డం సిగ్గు చేటన్నారు. ఏపీటీఎఫ్‌, యూటీఎఫ్‌ జిల్లా నాయకులు బసవలింగం, ప్రేమ్‌కుమార్‌ మాట్లాడుతూ డిమాండ్లపై ప్రజలకు అవగాహ న కల్పిస్తామన్నారు. ఫిబ్రవరి 6 అర్ధరాత్రి నుంచి జిల్లాలో బస్సులు రోడ్లపై తిరగవని ఆర్టీసీ ఎంప్లాయీస్‌ నాయకులు రవిశంకర్‌ తెలిపారు. ప్రభుత్వంలో విలీనం తర్వాత పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిరసన కార్యక్రమాల్లో భాగంగా బుధవారం అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రాలు ఇవ్వనున్నట్టు నాయకులు తెలి పారు. నిరసనలో ఏపీఎన్జీవో కార్యదర్శి సతీష్‌కు మార్‌, ఎస్టీయూ నాయకులు చంద్రజిత్‌ యాద వ్‌, ఏపీటీఎఫ్‌, సీపీఎస్‌ నాయకులు నరసిం హారావు, తిరుమలరెడ్డి, పార్థసారథి, పెన్షనర్ల, నాలుగో తరగతి, సచివాలయ ఉద్యోగుల సం ఘాల, రెవెన్యూ అసోసియేషన్‌,  అధ్యక్షులు డీ వెంకటేశ్వర్లు, కొండయ్య, అబ్దుల్‌రజాక్‌, కిరణ్‌ కుమార్‌, ఎన్జీవో కార్యవర్గ సభ్యులు ప్రసన్న కుమార్‌, వెంకటరెడ్డి, మూర్తి, జానీబాషా, శ్యామ్‌సుం దర్‌, శ్రీనివాస్‌, కుమార్‌బాబు, రవి కుమార్‌, శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సీఐటీయూ, ఏఐ టీయూసీ నాయకులు దండా లక్ష్మీ నారాయణ, అరుణ్‌కుమార్‌ తదిత రులు సంఘీభావం ప్రకటించారు.


సమితి చైర్మన్‌కి అస్వస్థత

ఉద్యోగుల ర్యాలీలో ఏపీ ఎన్జీవో, పీఆర్సీ సాధన సమితి జిల్లా చైర్మ న్‌ జీ శ్రీనివాసరావు స్వల్ప అస్వ స్థతకు గురయ్యారు. ప్రదర్శనలో భాగంగా ఆయనకు మార్గమధ్యలో చెమటలు పట్టి ఊపిరి ఆడకుండా పోయింది. దీంతో గమనించిన తోటి ఉద్యోగులు ఆయన్ను రమేష్‌ ఆస్పత్రికి తరలించారు. 


సలహాదారులకు రూ.లక్షల్లో

ధర్నాలో పాల్గొన్న శారద అనే ఉపాధ్యాయురాలు ప్రసంగిస్తూ ప్రతి ఒక్కరూ ఉద్యోగుల జీతాలపై ప్రశ్నించడం బాధగా ఉందన్నారు. నాలుగో తరగతి కూడా చదవని వారిని సలహాదారులుగా నియ మించి వారికి లక్షల్లో అందజేస్తు న్నారని, కష్టపడి ఉన్నత చదువు లు చదువుకున్న తాము వేలల్లో జీతాలు తీసుకోకూడదా అని ప్రశ్నించారు. రెండు రోజుల నుంచి ఐదు నిమిషాలు ఆలస్యంగా వస్తే పాఠశాలలకు వైసీపీ నాయకులు తాళాలు వేస్తున్నారని, హామీల అమల్లో ఇన్ని ఏళ్లు మౌనంగా ఉన్న ముఖ్యమంత్రికి ఏ గేటు తా ళాలు వేయాలని ప్రశ్నించారు. పీ ఎఫ్‌ సొమ్ము రూ.2 వేల 2 వంద ల కోట్లను రాత్రికి రాత్రే కాజే శార ని ఆరోపించారు. ఆమె ప్రసంగం ఆలోచింపజేసింది.

 

Updated Date - 2022-01-26T06:20:50+05:30 IST