Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఉద్యమ కార్యాచరణపై ఉద్యోగ జేఏసీ సమావేశం

గూడూరు, డిసెంబరు 6: స్థానిక విశ్రాంత ఉద్యోగుల భవనంలో సోమవారం ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏపీ జేఏసీ, ఏపీజేఏసీ అమరావతి నాయకుల పిలుపు మేరకు తాలూకా యూనిట్‌ టీచర్స్‌, ఆర్టీసీ, సచివాలయ అసోసియేషన్ల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ నెల 7 నుంచి జనవరి 6వ తేదీ వరకు నిర్వహించనున్న కార్యక్రమాలపై చర్చించామన్నారు. నాయకులు నాగరాజకుమార్‌, శ్రావణ్‌కుమార్‌, తనూజ్‌కుమార్‌, మహబూబ్‌బాషా, బాషా, రమణయ్య, మోహన్‌దాస్‌, రవిచంద్ర, చిరంజీవి, సుధీర్‌, అనీల్‌, ముదిరాజాచారి, శివరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు

Advertisement
Advertisement