Advertisement
Advertisement
Abn logo
Advertisement

అన్ని రంగాల్లో విభిన్న ప్రతిభావంతులకు ప్రోత్సాహం

విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభిస్తున్న మంత్రి ముత్తంశెట్టి

రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు

విశాఖపట్నం, డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి) : విభిన్న ప్రతిభావంతులు అన్ని రంగాల్లో రాణించేలా ప్రోత్సహించాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం వీఎంఆర్‌డీఏ చిల్డ్రన్‌ ఎరీనాలో శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ రాష్ట్రానికి చెందిన 15 మంది విభిన్న ప్రతిభావంతులు సివిల్స్‌కు ఎంపిక కావడంతోపాటు ఉన్నత హోదాల్లో పనిచేస్తుండడం వారి ఆత్మస్థైర్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వలంటీర్ల వ్యవస్థ తీసుకువచ్చి పెన్షన్లు లబ్ధిదారుల ఇంటికే వెళ్లి అందిస్తున్నారని,  ఈ విధానం వల్ల విభిన్న ప్రతిభావంతుల ఇబ్బందులు తొలగాయన్నారు. ఈ సందర్భంగా విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం మంత్రి వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన విభిన్న ప్రతిభావంతులకు బహుమతులను ప్రదానం చేశారు. విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ శ్రీధర్‌, జాయింట్‌ కలెక్టర్‌(ఆసరా) విశ్వేశ్వరరావు, జిల్లా విద్యాశాఖాధికారి చంద్రకళ, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు జీపీవీఆర్‌ శాస్ర్తి, స్వచ్చంధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. 


Advertisement
Advertisement