కరోనాపై యుద్ధానికి వ్యాక్సిన్‌తో ముగింపు : ఎంపీ

ABN , First Publish Date - 2021-01-17T06:28:30+05:30 IST

ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనాపై యుద్ధానికి వ్యాక్సిన్‌తో ముగింపు లభించనుందని ఎంపీ సోయం బాపురావ్‌ అన్నారు. శని వారం స్థానిక రిమ్స్‌లో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ను ప్రారంభించి, తొలి టీకాను డీపీవో డా.వైసీ శ్రీనివా్‌సకు చేశారు.

కరోనాపై యుద్ధానికి వ్యాక్సిన్‌తో ముగింపు : ఎంపీ
రిమ్స్‌లో కొవిడ్‌ షీల్డ్‌ టీకా వేసుకుంటున్న మహిళా వైద్యురాలు

రిమ్స్‌లో అధికారికంగా వ్యాక్సినేషన్‌ ప్రారంభం 

ఆదిలాబాద్‌ టౌన్‌, జనవరి 16: ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనాపై యుద్ధానికి వ్యాక్సిన్‌తో ముగింపు లభించనుందని ఎంపీ సోయం బాపురావ్‌ అన్నారు. శని వారం స్థానిక రిమ్స్‌లో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ను ప్రారంభించి, తొలి టీకాను డీపీవో డా.వైసీ శ్రీనివా్‌సకు చేశారు. అంతకుముందు వర్చ్యువల్‌ ద్వారా ప్రధాని మోదీ టీకాను ప్రారంభించి చేసిన ప్రసంగాన్ని ప్రత్యేక ఏర్పాట్ల మధ్య ఎంపీ, జడ్పీ చైర్మన్‌ రాథోడ్‌ జనార్ధన్‌, ఎమ్మెల్యే జోగు రామన్న, కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌లు వీక్షించారు. కాగా ప్రధాని తన ప్రసంగంలో తెలుగు ప్రముఖ కవి గురజాడ అప్పారావ్‌ పద్మం దేశంను ప్రేమించుమన్న.. మంచిదన్నది పెంచుమన్న అన్న పద్యంలోని అంశాలైన సొంత లాభం కొంత మానుకోవాల ని, దేశమంటే మట్టి కాదు.. దేశమంటే మనుషులని చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. ప్రసంగం అనంతరం వ్యాక్సినేషన్‌ రూంలో ఫ్రంట్‌ లైన్‌ వారియర్‌లకు టీకాలను వేశారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ ఇతర దేశాలు కరోనా తో యుద్ధం చేస్తుంటే దేశంలో ప్రధాని ఆధ్వర్యంలో టీకాను తీసుకురావడం దేశానికే గర్వకారణమన్నారు. ఇందులో కొవిడ్‌ వ్యాక్సిన్‌ జిల్లా అభ్జర్వర్‌ డా.రాజీవ్‌రాజ్‌, డీఎంఅండ్‌హెచ్‌ఓ డా.నరేందర్‌రాథోడ్‌,రిమ్స్‌ డైరెక్టర్‌ బలరాంనాయక్‌, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయలశంకర్‌, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-01-17T06:28:30+05:30 IST