Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఎండల మల్లన్న హుండీ ఆదాయం రూ.25 లక్షలు

టెక్కలి రూరల్‌: రావివలస ఎండల మల్లికార్జునస్వామి వారి దేవస్థానంలో కార్తీకమాసానికి సంబంధించి రూ.25,09,143 ఆదా యం వచ్చిందని ఈవో వీవీ సూర్యనారాయణ తెలిపారు. మంగళవారం ఉత్సవ ప్రత్యేకాధికారి, సోం పేట తనిఖీదారు జీవీబీఎస్‌ రవి కుమార్‌ పర్యవేక్షణలో హుండీ లెక్కించారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం, కేశఖండన, విరాళాలు, హుండీ ఆదాయం కలిపి ఈ మొత్తం  వచ్చిందన్నారు. గత ఏడాది కార్తీక మాసం కంటే ఈ ఏడాది రూ.7,37,037 ఆదాయం అదనంగా వచ్చిందని వెల్లడిం చారు. కార్యక్రమంలో కమిటీ చైర్మన్‌ సర్లాన సుధాకర్‌, అర్చకులు పాల్గొన్నారు. 

 

Advertisement
Advertisement