రైట్‌.. రైట్‌..

ABN , First Publish Date - 2020-05-20T10:16:12+05:30 IST

యాభై ఎనిమిది రోజుల తర్వాత ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో కాస్త ప్ర యాణీకుల రద్దీ కనిపించగా,

రైట్‌.. రైట్‌..

రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సులు  

అంతంత మాత్రంగానే ప్రయాణీకులు


పెద్దపల్లి, మే 19 (ఆంధ్రజ్యోతి): యాభై ఎనిమిది రోజుల తర్వాత ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో కాస్త ప్ర యాణీకుల రద్దీ కనిపించగా, మధ్యాహ్నం వేళలో బస్సులు ఖాళీగా వెళ్లాయి. కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు లాక్‌డౌన్‌ అమలుచేస్తున్న విషయం తెలిసిందే. నిబంధనల సడలింపుల్లో భాగంగా మంగళవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభు త్వం ఆర్టీసీ బస్సులను నడిపేందుకు అనుమతించడంతో బస్సులు రోడ్డె క్కాయి. జిల్లాలో గల గోదావరిఖని డిపో నుంచి 113 బస్సులకు 80 బ స్సులను నడిపించగా, మంథని డిపోలో 60 బస్సులకు 40 బస్సులను నడిపించారు.


కరీంనగర్‌, మంచిర్యాల, మంథని, భూపాలపల్లి, సికింద్రా బాద్‌, తదితర ప్రాంతాలకు ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్‌, సెమీలగ్జరీ, రాజధాని బస్సులను నడిపించారు. ఉదయం, సాయంత్రం ప్రయాణీకులతో బస్టాండ్లు రద్దీగా మారగా, మధ్యాహ్నం పూట ప్రయాణికులు తక్కువగా ఉన్నారు. బస్సులన్నీ ఖాళీగా వెళ్లాయి. తొలిరోజు కావడంతో ప్రయాణీ కుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ, బుధవారం నుంచి క్రమంగా ప్రయాణీకుల సంఖ్య పెరగ వచ్చని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. సీట్ల సంఖ్యకు మించి ఎక్కువ మందిని ఎక్కించుకోవ ద్దని, సాయంత్రం 7 గంటల వరకే బస్సులను నడిపించాలని ఆదేశించడంతో ఆ మేరకు బస్సు లను నడిపిస్తున్నారు. 


మంథనిలో..

లాక్‌డౌన్‌ నేపథ్యంలో దాదాపు 58 రోజుల పాటు డిపోకే పరిమితమైన ఆర్టీసీ మం గళవారం రోడ్డెక్కాయి. మంథని డిపోకు చెందిన 40 ఆర్టీసీ బస్సులను పలు రూట్లలో నడిపించినట్లు ఆర్టీసీ డీఎం రవీంద్రనాథ్‌ తెలిపారు. ఉ న్నతాధికారుల సూచనలు, ఆదేశాలనుసారం బస్సుల్లో సీట్లలో మాత్రమే కూర్చొని ప్రయాణం చేయాలని, ఎక్కువ రద్దీగా, గుంపులు గుంపులుగా బస్సులను నడిపించడం లేదన్నారు. అదే విధంగా కండక్టర్‌, డ్రైవర్లతో పాటు ప్రయాణికులు సైతం మాస్కులు ధరించాలని, మాస్కులు లేని వారిని బస్సులోకి అనుమతించడం లేదన్నారు. నిబంధనలు పాటిస్తూ ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. 


గోదావరిఖనిలో...

లక్ష్మీనగర్‌: కరోనా వైర్‌క  కారణంగా 58రోజులపాటు నిలిచిన ఆర్‌టీసీ బస్సులు రోడ్డెక్కాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ లాక్‌డౌన్‌ ఆంక్షలు ఎత్తివేయడంతో గోదావరిఖని నుంచి వివిధప్రాంతాలకు ఆర్‌టీసీ బస్సులు మంగళవారం నడిచాయి. కరోనా నిబంధనలు పాటించాలని డిపో అదికారులు కా ర్మికులకు సూచించారు. తప్పనిసరి మా స్క్‌లు ధరించాలని ఆదేశించారు.


దీంతో కండక్టర్లుల, డ్రైవర్లు మాస్క్‌లు ధరించి బస్సులు నడిపారు. ప్రయాణీకులు కూడా ఖచ్చితంగా మాస్క్‌లు ధరించాలని సూచించారు. సీట్లకు సరిపడా ప్రయాణీకులు మాత్రమే అనుమతించారు. మొదటిరోజు కావడంతో ప్ర యాణీకులు లేక బస్సులు ఖాళీగా నే వెళ్లాయి. సాయంత్రం వరకు 80 బస్సులు కరీంనగర్‌, హైద రాబాద్‌, భూపాలపల్లి, మంచి ర్యాల, మంథని తదితర ప్రాంతాలకు నడిపినట్టు అధికారులు తెలిపారు. 


Updated Date - 2020-05-20T10:16:12+05:30 IST