ఉద్యమ శత్రువులే.. రాజకీయ మిత్రులు

ABN , First Publish Date - 2021-06-18T06:51:57+05:30 IST

ఇన్నాళ్లు ఎప్పుడెప్పుడా..

ఉద్యమ శత్రువులే.. రాజకీయ మిత్రులు

రాథోడ్‌ రమేష్‌ చేరికతో మారిన బీజేపీ వైఖరి

ఆదివాసీ ఉద్యమానికి ఆటంకాలపై అనుమానాలు

సోయం, రాథోడ్‌ రాజకీయ భవిష్యత్‌పై జోరుగా చర్చ

జిల్లాలో గిరిజనులకు దగ్గరయ్యేందుకు ‘కమలం’ యత్నాలు


ఆదిలాబాద్‌(ఆంధ్రజ్యోతి): ఇన్నాళ్లు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన మాజీ ఎంపీ రాథోడ్‌రమేష్‌ చేరికపై ఉత్కంఠకు తెరపడింది. ఎట్టకేలకు రాథోడ్‌ రమేష్‌ ఈటలతో కలిసి కమలం పార్టీలో చేరిపోయారు. గతంలోనే రాథోడ్‌ రమేష్‌ బీజేపీలో చేరడం ఖాయమన్న వార్తలు వచ్చాయి. కానీ ఆయన చేరికపై ఎంపీ సోయం బాపూరావు కొంత అనుమానం వ్యక్తం చేయడంతో చేరిక వాయిదా పడుతు వచ్చింది.  కరోనా ఉధృతి పెరిగిపోవడంతో పరిస్థితులు కూడా అంతగా అనుకూలించలేదు. అనుకోకుండానే ఈటలతో కమలం పార్టీలో చేరేందుకు మాజీ ఎంపీరాథోడ్‌ రమేష్‌కు అవకాశం కలిసి వచ్చింది. దీంతో హస్తం పార్టీకి గుడ్‌బై చెప్పి కమలం పార్టీలో చేరిపోవడం చకచకా జరిగిపోయింది.


ఇదంతా బాగానే ఉన్నా.. ఈ ఇద్దరు నేతలు ఒకరు లంబాడా సామాజిక వర్గం కాగా మరొకరు ఆదివాసీ సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో పార్టీకి కొత్త చిక్కులు వచ్చి పడుతున్నాయి. కష్ట కాలంలో పార్టీ అధిష్ఠానం ఎవరి వైపు నిలబడుతుందోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కొంత కాలంగా ఆదివాసీలు లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలన్న డిమాండ్‌తో ఉద్యమం చేస్తూ వస్తున్నారు. ఎన్నో సభలు, సమావేశాల్లో ఇక వర్గంపై మరో వర్గం బహిరంగ విమర్శలు చేయడం పరిపాటిగానే మారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ ఆదివాసీల ఉద్యమం మొదలైతే ఈ ఇద్దరు నేతల వైఖరి ఎలా ఉంటుందోనన్న చర్చ జరుగుతోంది. ఇద్దరు నేతలు ఒక్కటై దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం చూపుతారా లేదా చెరో వర్గానికి నాయకత్వం వహిస్తారా అనేది జిల్లా అంతటా ఆసక్తికరంగా మారింది. గతంలో ఆదివాసీల వైపు నిలబడిన బీజేపీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఎటు వైపు నిలుస్తోందనని రాజకీయ వర్గాల్లో ఆసక్తి కనిపిస్తోం ది. ఇద్దరు గిరిజన నేతలు కావడంతో రిజర్వ్‌ స్థానమై న జిల్లా పార్లమెంట్‌ స్థానం నుంచి వచ్చే ఎన్నికల బ రిలో ఎవరు నిలబడతారనేది జిల్లాలో హాట్‌ టాపిక్‌ గా మారింది. మొత్తానికి బీజేపీ గిరిజన వర్గాలకు మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నా ప్రస్తుతం జిల్లాలో ఉన్న పరిస్థితుల కారణంగా ఏ మేరకు సాధ్యమవుతుందో వేచి చూడాల్సి ఉంది.


ఆశలన్నీ కేంద్రం పైనే..

జిల్లా పార్లమెంట్‌ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే ఆదివాసీల సమస్యలన్ని పరిష్కరిస్తామని అప్పట్లో కేంద్ర, రాష్ట్ర స్థాయి నేతలు హామీలిచ్చారు. అలాగే ఆదివాసీ  ఉద్యమ నేత సోయం బాపూరావు బరిలో నిలవడంతో ఆదివాసీల ఓట్లన్నీ గంప్ప గుత్తగా బీజేపీకే పడ్డాయి. అనుకున్నట్లుగానే సోయం బాపూరావు గెలువడంతో తమ సమస్యలన్నీ పరిష్కారమవు తాయని ఆదివాసీలు కేంద్రంపై ఎన్నో ఆశలు పెట్టు కుంటున్నారు. ఈ క్రమంలోనే  పార్టీలోకి రాథోడ్‌ రమేష్‌ రావడం ఆదివాసీలకు కొంత ఇబ్బందికరంగానే మారిందంటున్నారు. ఎక్కడ తమ ఉద్యమానికి ఆటం కాలు ఏర్పడుతాయోనన్న అనుమానాలు వ్యక్తమవుతు న్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇరు వర్గాలను ఒకటి చేసిముందుకు సాగడం బీజేపీకి అగ్నిపరీక్షగానే సాగుతుంది. ఏ వర్గం చేజారి పోయిన పార్టీకి ఇబ్బం దులు తప్పవంటున్నారు .సోయం, రాథోడ్‌లు  ఇద్దరు రాష్ట్ర స్థాయిలో గిరిజన వర్గాలను ప్రభావితం చేసే సత్తా ఉంది. ఇప్పటికే రెండేళ్లు గడిచినా ఆదివాసీల సమస్యల పరిష్కారంలో కేంద్ర ప్రభుత్వం ముంద డు గు వేసినట్లు కనిపించడం లేదు. దీనికి తోడు మరో వ ర్గం పార్టీకి దగ్గర కావడంతో కేంద్రం భవిష్యత్‌లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందోనన్న ఆందోళన మొదలైంది. రాజకీయ విశ్లేషకులు మాత్రం బీజేపీ వైఖరి మారే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నారు. 


తొలగింపు సాధ్యమేనా..!

కొన్నాళ్లుగా ఆదివాసీలు ఎస్టీ జాబితా నుంచి లంబాడాలను తొలగించారనే ప్రధాన డిమాండ్‌తో ఉద్యమం చేస్తున్నారు. అకస్మాత్తుగా లంబాడా సామా జిక వర్గానికి చెందిన రాథోడ్‌ రమేష్‌ బీజేపీలో చేరడంతో ఉద్యమానికి ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ ఇద్దరు నేతల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకునే నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఒకరు లంబాడాలను తొలగించాలని, మరోకరు వద్దని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుస్తూనే ఉంది. ఈ ఇద్దరు నేతలు కలిసి ఒకే వేదికపై ఆదివాసీ ఉద్యమంపై ప్రకటన చేసే అవకాశం కనిపించడం లేదు. వేరు వేరుగా ప్రకటనలు చేసిన పార్టీ ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంటుంది. ఎవరైనా పార్టీని ఇరుకున పెట్టే కార్యక్రమాలు చేపడితే అధిష్ఠానం చూస్తూ ఊరుకోదన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ఎస్టీ జాబితా నుంచి లంబాడాలను తొలగించే అంశం అంతా తేలికగా కాక పోయిన తెగల వారీగా నేతలు విడిపోతే పార్టీకి జరిగే లాభంకన్న నష్టమే ఎక్కువగా ంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.


బరిలో నిలిచేదెవరు..?

వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఆదిలాబాద్‌ సిట్టింగ్‌ స్థానం నుంచి ఎన్నికల బరిలో నిలిచేదెవరన్నదాని పై జోరుగా చర్చ జరుగుతోంది. అన్ని పరిస్థితులు కలిసి వస్తే మరోసారి గెలుపుపై ధీమాగా ఉన్న ఎంపీ సోయంకు రాజకీయాల్లో మాత్రం ఏది శాశ్వతం కాదన్న విషయం ఆయనలో కొత్త అనుమానాలకు దారి తీస్తోంది. కొన్నాళ్లుగా అధికారానికి దూరమై అవకాశం కోసం ఎదురు చూస్తున్న మాజీ ఎంపీ రాథోడ్‌కు ఏ అవకాశం వచ్చిన వదులుకోకూడదనే ఉద్దేశ్యంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన ఖానాపూర్‌, ఆసిఫాబాద్‌ అసెంబ్లీ నియోజక వర్గాలపై గురిపెట్టినా అప్పటి వరకు అధిష్ఠానం ఏది సూచించినా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. రాథోడ్‌ రమేష్‌ చేరిక పై ప్రస్తుతం ఎవరి అంచనాలు వారివే అయినప్పటికీ అధిష్ఠానం ఆశీస్సులు ఎలా ఉంటాయోనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేతలకు ఉమ్మడి జిల్లాపై పట్టు ఉండడంతో ఎవరి రాజకీయ భవిష్యత్‌ ఎలా ఉంటుందోనన్న చర్చ జరుగుతున్నా జిల్లాలో పార్టీ పరిస్థితులు మెరుగుపడితేనే నేతల కలలు నెరవేరనున్నాయి. ఎన్నికలకు సమయం ఉండడంతో అప్పటివరకు ఈ ఇద్దరు నేతలు కలిసే ముందుకు సాగుతారా లేదా విభేదాలతో పార్టీని ఇబ్బంది పెడతారా అనే దానిపై అనుమానాలే వ్యక్తమవుతున్నాయి.

Updated Date - 2021-06-18T06:51:57+05:30 IST