పిల్లలకు నేర్పించాల్పినవి

ABN , First Publish Date - 2020-05-21T05:30:00+05:30 IST

స్కూళ్లు తెరిచేందుకు మరికొన్నాళ్లు పట్టేలా ఉంది. ఒక ప్రణాళిక ప్రకారం పిల్లలు సంతోషంగా ఇంట్లోనే గడిపేందుకు ఏం చేయాలంటే...

పిల్లలకు నేర్పించాల్పినవి

  • స్కూళ్లు తెరిచేందుకు మరికొన్నాళ్లు పట్టేలా ఉంది. ఒక ప్రణాళిక ప్రకారం పిల్లలు సంతోషంగా ఇంట్లోనే గడిపేందుకు ఏం చేయాలంటే....

వర్చ్యువల్‌ క్లాస్‌రూమ్స్‌: చాలా స్కూళ్లు ఆన్‌లైన్‌లో పిల్లలకు ‘లెర్న్‌ ఫ్రమ్‌ హోమ్‌’ పద్ధతిన హోమ్‌వర్క్‌ ఇస్తున్నాయి. దాంతో వారు తిరిగి చదువులో పడతారు. పిల్లలు ప్రతి రోజూ హోమ్‌వర్క్‌ చేసేలా చూడాల్సిన బాధ్యత తల్లితండ్రులదే.

స్కిల్‌ డెవలప్‌మెంట్‌: ప్రతి రోజు ఒక కొత్త ఆరంభం అని పిల్లలకు చెప్పాలి. వారి అభిరుచిని బట్టి బొమ్మలు గీయడం, డాన్స్‌, యాక్టింగ్‌ వంటివి నేర్పించాలి. 

మంచి అలవాట్లు: రాత్రిపూట తొందరగా నిద్రపోవడం, ఉదయాన్నే త్వరగా నిద్రలేవడం వంటి మంచి అలవాట్లను పిల్లలకు అలవర్చాలి. వ్యాయామంతో పాటు పరిసరాల పరిశుభ్రత వంటివి అలవాటు చేయాలి. 

కుటుంబ బంధం: పిల్లలతో సరదాగా ఆడుకోవడం, వారికి కథలు చెప్పడం, పాటలు పాడడం, కుటంబమంతా చూడదగ్గ కార్యక్రమాలు చూడడం ద్వారా మీ అనుబంధం బలోపేతం అవుతుంది. 

సోషల్‌ మీడియా: పిల్లలు తమ స్నేహితులు, క్లాస్‌మేట్స్‌ను కలవలేని పరిస్థితి. వారంలో ఒకరోజు వీడియో కాల్‌ చేసి వారితో మాట్లాడించాలి. 

Updated Date - 2020-05-21T05:30:00+05:30 IST