7 ఏటీఎంలలో పేలుళ్లు..భారీగా నగదు చోరీ.. చివరికి..!

ABN , First Publish Date - 2020-07-27T22:58:35+05:30 IST

డు ఏటీఎంలలో చోరికి పాల్పడిన ఆరుగురు దొంగలను మధ్యప్రదేశ్ పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు.

7 ఏటీఎంలలో పేలుళ్లు..భారీగా నగదు చోరీ.. చివరికి..!

న్యూఢిల్లీ: ఏడు ఏటీఎంలలో చోరికి పాల్పడిన ఆరుగురు దొంగలను మధ్యప్రదేశ్ పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. అరెస్టైన వారిలో 28 ఏళ్ల వయసున్న ఓ యువ ఇంజినీర్ కూడా ఉన్నాడని వారు తెలిపారు. జిలాటిన్ స్టిక్స్, మోటర్‌సైకిల్ బ్యాటరీతో వారు ఏటీఎంలను పేల్చేసి డబ్బు దోచుకునేవారని పోలీసులు తెలిపారు. ఈ విధంగా ఇప్పటివరకూ దొంగల బృందం ఏడు ఏటీఎంలను లూటీ చేసిందన్నారు. వారి నుంచి రూ. 25.57 లక్షల నగదు, రెండు నాటు తుపాకులు, డిటోనేటర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులలో ఒకడైన ఇంజినీర్..గతంలో ఐఏఎస్ పరీక్షకు కూడా హాజరయ్యాడని, టీవీలలో వచ్చే క్రైమ్ సినిమాలు సీరియళ్లు చూస్తూ కొత్త కొత్త పథకాలు రచించేవాడని పోలీసులు తెలిపారు. 

Updated Date - 2020-07-27T22:58:35+05:30 IST