రాత్రిపూట బస్టాండ్ వద్ద 20 ఏళ్ల బీటెక్ యువతి.. అనుమానంతో పోలీసులు చెక్‌ చేస్తే ఆమె బ్యాగులో కనిపించిన దాన్ని చూసి..

ABN , First Publish Date - 2021-11-18T21:39:41+05:30 IST

ఆమె బీటెక్ చదువుతున్న 20 ఏళ్ల విద్యార్థిని.. రోజు ఇంటి నుంచి ఇంజనీరింగ్ కాలేజీకి వస్తూ పోతూ ఉంటుంది..

రాత్రిపూట బస్టాండ్ వద్ద 20 ఏళ్ల బీటెక్ యువతి.. అనుమానంతో పోలీసులు చెక్‌ చేస్తే ఆమె బ్యాగులో కనిపించిన దాన్ని చూసి..

ఆమె బీటెక్ చదువుతున్న 20 ఏళ్ల విద్యార్థిని.. రోజు ఇంటి నుంచి ఇంజనీరింగ్ కాలేజీకి వస్తూ పోతూ ఉంటుంది.. గత సోమవారం బస్టాప్‌ వద్ద ఉన్న ఆమెను పోలీసులు తనిఖీ చేశారు.. ఆమె బ్యాగులో ఓ కత్తి కనిపించింది.. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు.. విచారణలో భాగంగా ఆమె ఆసక్తికర విషయాలు వెల్లడించింది.. మధ్యప్రేదేశ్‌లోని జబల్పూర్‌లో ఈ ఘటన జరిగింది. 


జబల్పూర్‌‌లో ఇంజనీరింగ్ చదువుతున్న ఒక విద్యార్థిని బ్యాగులో చైనాలో తయారైన కత్తి కనిపించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆమెను అదుపు లోకి తీసుకుని విచారించారు. దానిని ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా కొనుగోలు చేసినట్టు ఆ యువతి పోలీసులకు చెప్పింది. తమ కాలేజీలోని ఎంతో మంది విద్యార్థినులు అలాంటి కత్తులను కొన్నారని ఆమె తెలిపింది. భద్రత కోసమే తాము వాటిని కొంటున్నామని ఆమె చెప్పింది.


తాము కాలేజీకి వచ్చే దారిలో ఉన్న మండ్వా బస్తీలో ఉండే రౌడీ మూకల నుంచి తమను తాము రక్షించుకోవడానికి విద్యార్థినులు ఈ కత్తులను కొంటున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. కాగా, ఆయుధాన్ని కలిగి ఉందనే కారణంతో పోలీసులు ఆ యువతిని అరెస్ట్ చేశారు. అనంతరం తల్లిదండ్రులను పిలిపించి బెయిల్‌పై విడుదల చేశారు. అలాంటి కత్తులను ఆన్‌లైన్ ద్వారా కొన్న మిగతా విద్యార్థినుల గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. 

Updated Date - 2021-11-18T21:39:41+05:30 IST