పాక్ సిరీస్‌కు ఇంగ్లాండ్ బ్యాటింగ్ కోచ్‌గా ట్రాట్

ABN , First Publish Date - 2020-08-04T02:19:35+05:30 IST

ఇంగ్లాండ్-పాకీస్తాన్ జట్ల మధ్య బుధవారం నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ జట్టుకు...

పాక్ సిరీస్‌కు ఇంగ్లాండ్ బ్యాటింగ్ కోచ్‌గా ట్రాట్

లండన్: ఇంగ్లాండ్-పాకీస్తాన్ జట్ల మధ్య బుధవారం నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌‌‌ను మార్పుస్తున్నట్లు ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. కొత్త కోచ్‌గా మాజీ బ్యాట్స్‌మన్ జానథన్ ట్రాట్‌ను నియమిస్తున్నట్లు ప్రకటించింది. రెండు రోజుల్లో ప్రారంభం కానున్న టెస్ట్ సిరీస్‌‌కు జట్టు బ్యాటింగ్ కోచ్‌ బాధ్యతలను ట్రాట్ నిర్వహిస్తాడని ఈసీబీ తెలిపింది. ఇదిలా ఉంటే ఇంగ్లాండ్-పాకీస్తాన్‌ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ బుధవారం నుంచి మాంచెస్టర్‌లో ప్రారంభం కానుంది. ఆ తరువాతి రెండు మ్యాచ్‌లు సౌతాంప్టన్‌లో జరగనున్నాయి. అయితే ఆఖరిసారిగా ఈ రెండు జట్లు పోటీపడిన టెస్ట్ సిరీస్‌లో ఇంగ్లాండ్ జట్టే విజయం సాధించింది. దీంతో ఈ సారైనా సిరీస్ నెగ్గాలని పాక్ పట్టుదలతో ఉంది. అయితే ఈ సిరీస్‌లో కూడా పాక్‌పై విజయం సాధించి తమ ఆధిపత్యం కొనసాగించాలని ఇంగ్లాండ్ భావిస్తోంది.

Updated Date - 2020-08-04T02:19:35+05:30 IST