Abn logo
Jun 10 2021 @ 04:56AM

మోర్గాన్‌, బట్లర్‌ జాతి వివక్ష వ్యాఖ్యలు

  • విచారణకు ఈసీబీ ఆదేశం

లండన్‌: వన్డే కెప్టెన్‌ మోర్గాన్‌, వికెట్‌ కీపర్‌ బట్లర్‌పై ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) విచారణకు ఆదేశించింది. వారు గతంలో చేసిన జాతి వివక్ష వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరలవడంతో ఈసీబీ ఈ చర్య చేపట్టింది. భారతీయులను కించపరిచేలా ‘సర్‌’ అని మోర్గాన్‌, బట్లర్‌ ట్వీట్‌ చేశారు. 2018 ఐపీఎల్‌లో ముంబైతో మ్యాచ్‌లో రాజస్థాన్‌ బ్యాట్స్‌మన్‌ బట్లర్‌ (53 బంతుల్లో 94 నాటౌట్‌) చెలరేగాడు. దాంతో బట్లర్‌ను ప్రశంసిస్తూ ‘సర్‌’ అని మోర్గాన్‌ ట్వీట్‌ చేశాడు. బట్లర్‌ కూడా ‘సర్‌’ అంటూ మోర్గాన్‌ ట్వీట్‌కు స్పందించాడు. 2013లో చేసిన జాతి వ్యతిరేక ట్వీట్లతో పేసర్‌ ఓలీ రాబిన్సన్‌ను సస్పెండ్‌ చేసిన రెండ్రోజులకే..మోర్గాన్‌, బట్లర్‌ వ్యాఖ్యలు బయటపడడం, వాటిపై ఈసీబీ విచారణకు జారీ చేయడం గమనార్హం.  


Advertisement
Advertisement
Advertisement