Abn logo
Aug 10 2020 @ 18:06PM

రిటైర్‌మెంట్ ఆలోచన లేదు: ఆండర్సన్

లండన్: ఇంగ్లాండ్ స్టార్ బౌలర్లలో జేమ్స్ ఆండర్సన్ తన రిటైర్మెంట్ వార్తలపై క్లారిటీ ఇచ్చాడు. ఇప్పుడప్పుడే తాను ఆటకు గుడ్ బై చెప్పనని, మరి కొన్నాళ్ళు కొనసాగుతానని తెలిపాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆండర్సన్ రిటైర్మెంట్‌పై అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు. పాకీస్తాన్ టెస్ట్‌లో ఒక్క వికెట్ మాత్రమే తీయడంపై కూడా వివరణ ఇచ్చాడు. తన బౌలింగ్‌ లయ తప్పిన మాట వాస్తవమేనని, అయితే రెండో టెస్టులో బాగా ఆడేందుకు కృషి చేస్తానని, బౌలింగ్‌ను గాడిలో పెట్టేందుకు మరింత పట్టుదలతో ప్రాక్టీస్ చేస్తానని తెలిపాడు. ఇదిలా ఉంటే ఇప్పటి వరకూ 154 టెస్టులు ఆడిన ఆండర్సన్ 590 వికెట్లు తీశాడు. ఇంగ్లాండ్ తరుపున టెస్టుల్లో ఇన్ని వికెట్లు తీసిన ఏకైక బౌలర్‌గా ఆండర్సన్ నిలిచాడు.

Advertisement
Advertisement
Advertisement