కోహ్లీకి కష్టమే..: టర్నర్‌

ABN , First Publish Date - 2021-06-09T05:54:03+05:30 IST

ఇంగ్లండ్‌లో పిచ్‌లు స్వింగ్‌, సీమ్‌కు అనుకూలిస్తే విరాట్‌ కోహ్లీ ఇబ్బందిపడే అవకాశం ఉందని న్యూజిలాండ్‌ మాజీ కెప్టెన్‌ గ్లెన్‌ టర్నర్‌ అన్నాడు. ‘వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌లో భారత్‌ రాణింపు అక్కడి పరిస్థితులపైనే...

కోహ్లీకి కష్టమే..: టర్నర్‌

న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌లో పిచ్‌లు స్వింగ్‌, సీమ్‌కు అనుకూలిస్తే విరాట్‌ కోహ్లీ ఇబ్బందిపడే అవకాశం ఉందని న్యూజిలాండ్‌ మాజీ కెప్టెన్‌ గ్లెన్‌ టర్నర్‌ అన్నాడు. ‘వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌లో భారత్‌ రాణింపు అక్కడి పరిస్థితులపైనే ఆధారపడి ఉంటుంది. ఒకవేళ బంతి స్వింగ్‌, సీమ్‌ అయితే మాత్రం మిగతా బ్యాట్స్‌మెన్‌తో పాటు కోహ్లీకి కూడా తిప్పలు తప్పవు. న్యూజిలాండ్‌లో వారికి ఇలాంటి స్థితే ఎదురైంది. ఇటీవల భారత్‌లోనూ పిచ్‌లు స్వింగ్‌కు అనుకూలిస్తున్నా కివీస్‌తో వాటిని పోల్చలేం. ఇక ఇంగ్లండ్‌లోనూ పరిస్థితులు సాధారణంగా కివీస్‌తరహాలోనే ఉంటాయి’ అని టర్నర్‌ గుర్తుచేశాడు.

Updated Date - 2021-06-09T05:54:03+05:30 IST