ఇంగ్లండ్-విండీస్ తొలి టెస్టు: హోల్డర్, గాబ్రియెల్ దెబ్బకు ఇంగ్లండ్ విలవిల

ABN , First Publish Date - 2020-07-10T03:16:38+05:30 IST

కరోనా మహమ్మారి కారణంగా దాదాపు దాదాపు నాలుగు నెలలపాటు ప్రపంచంలో అన్ని క్రీడలు మూగబోయిన

ఇంగ్లండ్-విండీస్ తొలి టెస్టు: హోల్డర్, గాబ్రియెల్ దెబ్బకు ఇంగ్లండ్ విలవిల

సౌతాంప్టన్: కరోనా మహమ్మారి కారణంగా దాదాపు దాదాపు నాలుగు నెలలపాటు ప్రపంచంలో అన్ని క్రీడలు మూగబోయిన వేళ..  సౌతాంప్టన్‌లో బుధవారం ఇంగ్లండ్-విండీస్ మధ్య తొలి టెస్టు ప్రారంభం కావడంతో అభిమానులు మళ్లీ ఊపిరి పీల్చుకున్నారు. అయితే, కరోనా వైరస్ భయపెడుతుండడంతో బయో సెక్యూర్ వాతావరణంలో మ్యాచ్ నిర్వహించారు. అభిమానులు లేక రోజ్‌బౌల్ స్టేడియం బోసిపోగా, ఆటగాళ్లు కరచాలనానికి దూరంగా ఉన్నారు.

 

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్‌కు తొలి రోజు కలిసి రాలేదు. ఆటకు వరుణుడు పలుమార్లు అంతరాయం కలిగించాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ 17.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 35 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓవర్‌నైట్ స్కోరు 35తో రెండో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లండ్ 204 పరుగులకే ఆలౌట్ అయింది. విండీస్ బౌలర్లు హోల్డర్, గాబ్రియెల్ దెబ్బకు ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూకట్టారు.  ఓపెనర్ రోరీ బర్న్స్ (30), కెప్టెన్ స్టోక్స్ (43), జోస్ బట్లర్ (35), డోమ్ బెస్ (31, నాటౌట్) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. హోల్డర్ ఆరు వికెట్లు నేలకూల్చగా, గాబ్రియెల్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. 


అనంతరం విండీస్ తొలి ఇన్నింగ్స్ ప్రారంభించగా వెలుతురు మందగించడంతో మ్యాచ్‌ను 11 ఓవర్ల తర్వాత నిలిపివేవారు. రెండో రోజు ఆట నిలిచిపోయే సరికి విండీస్ వికెట్ నష్టపోకుండా 36 పరుగులు చేసింది. క్రెయిగ్ బ్రాత్‌వైట్ 9, జాన్ కాంప్‌బెల్ 21 పరుగులతో క్రీజులో ఉన్నారు. 

Updated Date - 2020-07-10T03:16:38+05:30 IST