ఆంగ్లభాషపై పట్టు సాధించాలి

ABN , First Publish Date - 2020-02-28T11:37:27+05:30 IST

ఆంగ్లభాషపై పట్టు సాధిస్తే అకాడమిక్‌ రంగంలో వ్యక్తిగత జీవిత ఉన్నతికి, అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుందని అమెరికన్‌ లైబ్రరీసైన్స్‌ ఫ్రొపెసర్‌ ఎరిన్‌హోరాంజె అన్నారు.

ఆంగ్లభాషపై పట్టు సాధించాలి

గణేశ్‌నగర్‌, ఫిబ్రవరి 27: ఆంగ్లభాషపై పట్టు సాధిస్తే అకాడమిక్‌ రంగంలో వ్యక్తిగత జీవిత ఉన్నతికి,  అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుందని  అమెరికన్‌ లైబ్రరీసైన్స్‌ ఫ్రొపెసర్‌ ఎరిన్‌హోరాంజె అన్నారు. గురువారం ఎస్సారార్‌ ప్రభుత్వ కళాశాలలో ఆంగ్ల విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ ఉపాధి అవకాశాలు సాధన - ఆంగ్ల భాషా నైపుణ్యం అనే అంశంపై ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా  పీజీ విద్యార్థిని విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. సభాధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కలువకుంట రామకృష్ణ మాట్లాడుతూ సాంకేతికత, ఆంగ్లభాష నైపుణ్య వికాసాలపై అమెరికన్‌ ప్రొఫెసర్‌ చేత విద్యార్థిని విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించడం వల్ల పలు సందేహాలకు సమాధానాలు లభించాయని చెప్పారు. గ్రంథాలయాన్ని ఈ రిసోర్స్‌గా వాడే విధానం తెలిసిందన్నారు. ఆంగ్ల విభాగం అధిపతి ఉమామహేశ్వరి మాట్లాడుతూ విదేశీ ఉన్నత విద్యాప్రయత్నాలు చేసే వారికి ఈ అవగాహనతో లాభం చేకూరుతుందని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్‌ ఓదెలుకుమార్‌, డాక్టర్‌ శోభ, ఎస్‌ రాజేశ్‌, లైబ్రేయిన్‌ కె సురేందర్‌, వైస్‌ప్రిన్సిపాల్‌ ఎం హిమబిందు, తదితర అధ్యాపకులు, డిగ్రీ, పీజీ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - 2020-02-28T11:37:27+05:30 IST