ఈ ఏడాది నుంచే ఆంగ్ల మాధ్యమం

ABN , First Publish Date - 2020-09-24T11:08:48+05:30 IST

ఈ ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాద్యమ బోధనను ప్రవేశ పెడుతున్నామని ఆ మేరకు విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌ పె

ఈ ఏడాది నుంచే ఆంగ్ల మాధ్యమం

పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్‌  


ఏలూరు ఎడ్యుకేషన్‌/దెందులూరు, సెప్టెంబరు 23: ఈ ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాద్యమ బోధనను ప్రవేశ పెడుతున్నామని ఆ మేరకు విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌ పెరగాల్సిం దేనని పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్‌ సూచించారు.


జిల్లాలో నాడు-నేడు పనుల ప్రగతిని పరిశీలించేం దుకు బుధవారం ఏలూరులోని కండ్రికగూడెం, శనివారపుపేట- 2, కొవ్వలి ప్రాథమిక పాఠశాలలతో పాటు, కస్తూరిభా మున్సి పల్‌ హైస్కూలును ఆయనతోపాటు విద్యా శాఖ కమిషనర్‌ వి.చినవీర భద్రుడు, సమగ్రశిక్ష ఎస్‌పీడీ వెర్రిసెల్వి, నాడు-నేడు ఇన్‌ఫ్రా సలహాదారు ఎ.మురళీ సందర్శించారు.


నిర్ధేశిత తొమ్మిది రకాల పనులను నూరు శాతం నాణ్యతతో సకాలంలో పూర్తిచేసిన శనివా రపుపేట-2 ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం ఝాన్సీ రాణిని అభినం దించడంతోపాటు, ఈ స్కూలు రాష్ట్రంలోనే టాప్‌-10లో నిలిచిం దని ప్రశంసించారు. మున్సిపల్‌ పాఠశాలల్లో నాడు-నేడు పనులు మందకొడిగా జరుగుతుండడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.


కస్తూరిభా మున్సిపల్‌ హైస్కూల్‌ అభివృద్ధికి జేసీ(అభివృద్ధి) హిమాన్షు శుక్లాకు దత్తత ఇస్తున్నామని వెల్లడించారు. విద్యాకా నుక కిట్లలోని వస్తువులు, యూనిఫాం పరిశీలించారు. సమగ్ర శిక్ష జిల్లా ప్రాజెక్టు ఎపీసీ కాత్యాయినీ ప్రసన్న, ఏలూరు డీవై ఈవో ఉదయకుమార్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - 2020-09-24T11:08:48+05:30 IST