వేతనాల్లో కోతకు ససేమిరా..

ABN , First Publish Date - 2020-04-06T09:38:27+05:30 IST

కొవిడ్‌-19 ఉధృతి కారణంగా తమ వేతనంలో 30 శాతం కోతకు ఇంగ్లిష్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఈపీఎల్‌) ఆటగాళ్లు అంగీకరించలేదు. ఇతర లీగ్‌ల్లో బార్సిలోనా,..

వేతనాల్లో కోతకు ససేమిరా..

ఈపీఎల్‌ ఆటగాళ్ల నిర్ణయం

లండన్‌: కొవిడ్‌-19 ఉధృతి కారణంగా తమ వేతనంలో 30 శాతం కోతకు ఇంగ్లిష్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఈపీఎల్‌) ఆటగాళ్లు అంగీకరించలేదు. ఇతర లీగ్‌ల్లో బార్సిలోనా, యువెంటస్‌, బయేర్న్‌ మ్యూనిచ్‌ ఆటగాళ్లు వేతనాల్లో కోతకు అంగీకరిస్తూ తమ వంతు నిధులను అందించారు. కానీ ఈపీఎల్‌ ఆటగాళ్ల వైఖరిపై అటు రాజకీయంగానూ విమర్శలు వస్తున్నాయి. కానీ 30 శాతం కోత కారణంగా ప్రభుత్వం పన్నుల రూపంలో 200 మిలియన్‌ పౌండ్ల (రూ.1875 కోట్లు)ను నష్టపోవాల్సి వస్తుందని గుర్తుచేశారు. ఒక్కో ప్రీమియర్‌ ఆటగాడి సగటు వార్షిక వేతనం 3 మిలియన్‌ పౌండ్లు (రూ.28 కోట్లు)గా ఉంటుందని అంచనా.  

Updated Date - 2020-04-06T09:38:27+05:30 IST