Abn logo
Sep 17 2021 @ 23:57PM

ఏపీలో ఆంగ్లేయుల పాలన

విలేకర్లతో మాట్లాడుతున్న అమీర్‌బాబు

చంద్రబాబు ఇంటిపై దాడికి నిరసనగా టీడీపీ నేతల నిరసన

కమలాపురంలో సాయినాథశర్మ అరెస్టు

కమలాపురం(రూరల్‌), సెప్టెంబరు 17: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రస్తుతం ఆంగ్లేయుల పాలన నడుస్తోందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీభట్ల సత్యసాయినాథశర్మ వైసీపీ ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శించారు. ఈ సందర్భంగా ఉండవల్లిలోని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటిపై ఎమ్మెల్యే జోగి రమేష్‌ రాళ్లతో దాడి చేసినందుకు నిరసనగా శుక్రవారం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సాయినాథశర్మ ఆధ్వర్యంలో కమలాపురం నాలుగు రోడ్ల కూడలిలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం బ్రిటీష్‌ పాలనలో మన రాష్ట్రం ఉందేమోననే భావన కలుగుతోందన్నారు. రౌడీయిజానికి మారుపేరుగా మారిన  ఈ ప్రభుత్వాన్ని తక్షణమే సాగనంపాలని పేర్కొన్నారు. కాగా, ధర్నా, రాస్తారోకో చేసిన సాయినాథశర్మను పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. కార్యక్రమంలో టీడీపీ కడప పార్లమెంటు జిల్లా మీడియా కోఆర్డినేటర్‌ జనార్ధన్‌రావు, నాయకులు శంకర్‌రెడ్డి, తెలుగుయువత జిల్లా అధ్యక్షుడు యల్లారెడ్డి, యాదవరెడ్డి, గండి నారాయణ, తదితరులు పాల్గొన్నారు. 


దాడిని ఖండిస్తున్నాం

చంద్రబాబు ఇంటిపై వైసీపీ నేతల దాడిని ఖండిస్తున్నామని ఐటీడీపీ కడప పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి నరసింహ, పార్లమెంటు తెలుగు యువత అధ్యక్షుడు యల్లారెడ్డిలు తెలిపారు. శుక్రవారం వారు విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఇంత ఉన్మాద ప్రభుత్వం దేశంలో మరొకటి లేదన్నారు. కాగా, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సాయినాథశర్మను అరెస్టు చేయడం దారుణమన్నారు. కార్యక్రమంలో తెలుగుయువత రాష్ట్ర నాయకుడు అమర్‌నాథ్‌రెడ్డి, శ్రీనివాసులు, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.


ఏపీలో వైసీపీ ఆటవిక రాజ్యం

కడప, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): ఏపీలో వైసీపీ ఆటవిక రాజ్యమేలుతోందని టీడీపీ కడప అసెంబ్లీ ఇన్‌చార్జి వీఎస్‌ అమీర్‌బాబు పేర్కొన్నారు. జడ్‌ కేటగిరీ ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకే భద్రత కరువైతే, ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. శుక్రవారం టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడారు. నగర అధ్యక్షుడు సానపురెడ్డి శివకొండారెడ్డి, ఆమూరి బాలదాసు, మాసా కోదండరామ్‌, కొండా సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. 


చంద్రబాబు ఇంటిపై దాడి సరికాదు

చంద్రబాబు ఇంటిపై ఎమ్మెల్యే ఆధ్వర్యంలో వైసీపీ నేతలు దాడి చేయడం సరికాదని రైతు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శివారెడ్డి, ఉపాధిహామీ పథకం మాజీ కౌన్సిల్‌ సభ్యుడు పీరయ్యలు వేర్వేరు ప్రకటనల్లో ఖండించారు. దాడికి పాల్పడిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. 


చెన్నూరులో : రాష్ట్రంలో రోజు రోజుకు వైసీపీ గూండాగిరి పాలన సాగిస్తోందని మండల టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం సాయంత్రం చెన్నూరులో టీడీపీ రైతు విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గుమ్మల మల్లిఖార్జునరెడ్డి, కడప మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ ఇందిరెడ్డి శివారెడ్డిలు మాట్లాడుతూ రోజు రోజుకూ వైసీపీ పాలనతో ఎవరికీ రక్షణ లేకుండా పోతోందని మండిపడ్డారు. కార్యక్రమంలో మండల కన్వీనర్‌ విజయభాస్కర్‌రెడ్డి, మైనార్టీ కార్యదర్శి ఖాజాహుస్సేన్‌, గంధం ప్రసాద్‌, ఆకుల చలపతి, కుందేటి కృష్ణయ్య, తదితరులు పాల్గొన్నారు. 


వల్లూరులో : చంద్రబాబు ఇంటిపై దాడి హేయమైన చర్య అని మండల టీడీపీ అధ్యక్షుడు నాగేశ్వర్‌రెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పరిపాలన జరుగుతోందని, ఇటువంటి వాటికి తమ పార్టీ నేతలు భయపడే ప్రసక్తే లేదన్నారు. సమావేశంలో మాజీ ఎంపీటీసీ రామకృష్ణారెడ్డి, రమణారెడ్డి, సుబ్బారెడ్డి, మధు, చిట్టిబాబు, విశ్వనాధ్‌ పాల్గొన్నారు.