గుర్తించండి...అతికించండి!

ABN , First Publish Date - 2020-06-17T05:30:00+05:30 IST

ఇంగ్లీషు పదాల స్పెల్లింగ్‌, ఉచ్చారణ నేర్చుకోవడానికి ఈ యాక్టివిటీ ఉపయోగపడుతుంది. టైమ్‌ పాస్‌గానూ ఉంటుంది...

గుర్తించండి...అతికించండి!

  • ఇంగ్లీషు పదాల స్పెల్లింగ్‌, ఉచ్చారణ నేర్చుకోవడానికి ఈ యాక్టివిటీ ఉపయోగపడుతుంది. టైమ్‌ పాస్‌గానూ ఉంటుంది.


కావలసినవి:

  1. కొన్ని పాత మ్యాగజైన్లు
  2. ఏ3 సైజు తెల్ల పేపర్‌ 
  3. మార్కర్‌
  4. జిగురు
  5. కత్తెర


తయారీ:

  1. ముందుగా పేపర్‌పై ఎడమ వైపు ఇంగ్లీషు అక్షరాలు రాయాలి. 
  2. ఒక మ్యాగజైన్‌ తీసుకోవాలి. అందులో అల్ఫాబెట్‌తో ప్రారంభమయ్యే బొమ్మలు గుర్తించి కట్‌ చేయాలి.
  3. ఉదాహరణకు ‘ఎ’ ఆల్ఫాబెట్‌ కోసం అకౌంటెంట్‌ బొమ్మ, ‘బి’ ఆల్ఫాబెట్‌ కోసం బుక్‌, ‘జడ్‌’ కోసం జీబ్రా బొమ్మను తీసుకోవాలి. 
  4. వరుసగా అన్ని ఆల్ఫాబెట్‌లకు బొమ్మలు గుర్తించి కట్‌ చేయాలి. వాటిని పేపర్‌పై అతికించాలి. వాటి పేరు కింద రాయాలి.
  5. ఈ యాక్టివిటీ వల్ల పదాల స్పెల్లింగ్‌ తెలుసుకోవడం, రాయడం నేర్చుకోవచ్చు.

Updated Date - 2020-06-17T05:30:00+05:30 IST