ఎన్నాళ్లీ నిరీక్షణ!

ABN , First Publish Date - 2021-05-10T05:54:23+05:30 IST

నిరుపేద ఆడపిల్లల కుటుంబాల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రవేశ పెట్టిన బాలికా సంరక్షణ పథకానికి తూట్లుపొడుస్తు న్నారు. ఏళ్లు గడుస్తున్నా సహాయం అందక లబ్ధిదారులు ఎదురుచూపులు చూస్తున్నారు.

ఎన్నాళ్లీ నిరీక్షణ!
ఉరవకొండలోని ఐసీడీఎస్‌ ప్రాజెక్టు కార్యాలయం

బాలికా సంరక్షణ పథకానికి అందని సాయం

లబ్ధిదారుల ఎదురుచూపులు


ఉరవకొండ, మే 9: నిరుపేద ఆడపిల్లల కుటుంబాల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రవేశ పెట్టిన బాలికా సంరక్షణ పథకానికి తూట్లుపొడుస్తు న్నారు. ఏళ్లు గడుస్తున్నా సహాయం అందక లబ్ధిదారులు ఎదురుచూపులు   చూస్తున్నారు. గడువు పూర్తయినా నిధులు విడుదల కావడం లేదు. ఉరవకొండ ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలో 679 మందికి బాలికా సంరక్షణ పథకం బాండ్లు పంపిణీ చేశారు. రెండున్నర దశాబ్దాల కిందట ఈ పథకాన్ని ప్రా రంభించారు. ఈ పథకం పర్యవేక్షణను ఐసీడీఎస్‌ అధికారులకు బాధత్యలు అప్పగించారు. బాలికల చదువు అనంతరం వివాహానికి ఆర్థిక సహాయం కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ప్రభుత్వ లక్ష్యం పేద కుటుంబాలకు ఎంతో భరోసాగా నిలిచింది. గ్రామీణ ప్రాంతాలలో రూ.20 వేలు, పట్టణ ప్రాంతాలలో రూ.25 వేల ఆదాయం లోపు ఉన్న బాలికలను ఈ పథకం కింద ఎంపిక  చేశారు.


20 సంవత్సరాలు దాటిన తర్వాత ఒక కుటుంబం లో ఒక ఆడపిల్ల ఉంటే రూ.లక్ష చొప్పున, ఇద్దరు ఆడపిల్లలు ఉంటే ఒక్కొక్కరికి రూ.30 వేల చొప్పున మంజూరు చేయనున్నట్లు అప్పట్లో ప్రకటించా రు. ఈ పథకం ప్రారంభమయ్యాక పదేళ్ల పాటు విజయవంతంగా నడిచింది. 2005 ఏడాది తర్వాత ఈ పథకానికి అర్హులైన లబ్ధిదారులకు నిధు లు విడుదల కాక చెల్లింపులు సక్రమంగా చేయలేక పోయారు. 


పుస్తకాల స్థానంలో బాండ్లు

పథకం ప్రారంభ సమయంలో లబ్ధిదారులకు పుస్తకాలు మంజూరు చేసేవారు. సంబంధిత పాఠశాలలు, కళాశాలలు ప్రిన్సిపాళ్లతో చదువుతున్నట్లు సంతకాలు చేయించి ఐసీడీఎస్‌ కార్యాలయంలో అందజేసేవారు. 2005 త ర్వాత పుస్తకాల స్థానంలో బాండ్లను పంపిణీ చేశారు. అప్పట్లో బాండ్లు తీసుకున్న వారిలో చాలా మందివి మెచ్యూరిటీ కూడా అయ్యాయి. వారికి ప్ర భుత్వం ఇస్తామన్న ఆర్థికసాయం అందలేదు. మెచ్యూరిటీ అయిన బాం డ్లను లబ్ధిదారులు సంబంధిత కార్యాలయంలో సమర్పిస్తున్నారు. ఆనలైనలో అన్ని వివరాలతో కూడిన పత్రాలను సిబ్బంది అప్‌లోడ్‌ చేస్తున్నారు. కా నీ ప్రభుత్వం నుంచి నిధులు జమ కాలేదు. ఈ విషయంపై ఐసీడీఎస్‌ సీడీపీవో రాధికను వివరణ కోరగా, మెచ్యూరిటీ అయిన బాండ్లను ఆనలైన చేసి పంపిస్తున్నామన్నారు. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరైన వెంటనే అం దజేస్తామని తెలిపారు. 

Updated Date - 2021-05-10T05:54:23+05:30 IST