హాబీతో గిన్నిస్‌ బుక్‌లోకి!

ABN , First Publish Date - 2021-03-09T05:30:00+05:30 IST

ఒక్కొక్కరికి ఒక్కో హాబీ ఉంటుంది. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో మారియన్‌ కౌంటీలో ఉండే సిండీ డన్లోకు ఫ్లెమింగో బొమ్మలంటే ప్రాణం. అందుకే వాటి సేకరణను హాబీగా మార్చుకుంది

హాబీతో గిన్నిస్‌ బుక్‌లోకి!

ఒక్కొక్కరికి ఒక్కో హాబీ ఉంటుంది. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో మారియన్‌ కౌంటీలో ఉండే సిండీ డన్లోకు ఫ్లెమింగో బొమ్మలంటే ప్రాణం. అందుకే వాటి సేకరణను హాబీగా మార్చుకుంది. ఆ హాబీనే ఆమెకు గిన్నిస్‌ బుక్‌లో స్థానం సంపాదించేలా చేసింది. 

  • సిండీ డన్లోకు చిన్నతనంలోనే ఫ్లెమింగో పక్షులంటే ఇష్టం ఏర్పడింది.  పెద్దవుతున్నా వాటిపై ఇష్టం మాత్రం పోలేదు. ఎక్కడ ఫ్లెమింగ్‌ పక్షి బొమ్మ కనిపించినా వదిలేది కాదు. అలా ఇప్పటి వరకు ఆమె 865 ఫ్లెమింగో బొమ్మలు సేకరించింది. 
  • తను సేకరించిన వివిధ ఫ్లెమింగో బొమ్మలతో ఒక దుకాణం ఏర్పాటు చేసింది. దాని ముందు ‘వెల్‌కమ్‌ టు అఫిషియల్‌ ఫ్లోరిడా ఫ్లెమింగ్‌ మ్యూజియం’ అని రాసి ఉంటుంది. 
  • ఆమె షాపులో అర అంగుళం నుంచి 5 అడుగుల పొడవు ఉన్న ఫ్లెమింగో బొమ్మలు ఉన్నాయి. దాంతో ప్రపంచంలో ఎక్కువ ఫ్లెమింగ్‌ బొమ్మల సేకరించిన వ్యక్తిగా ఆమెకు గిన్నిస్‌ బుక్‌లో చోటు దక్కింది.  

Updated Date - 2021-03-09T05:30:00+05:30 IST