Abn logo
Sep 28 2021 @ 00:00AM

కిట్టీ బొమ్మలతో గిన్నిస్‌ బుక్‌లోకి..!

అతని ఇంట్లో అడుగుపెడితే హలో కిట్టీ బొమ్మలు స్వాగతం పలుకుతాయి. అలా అని ఒకటి రెండు బొమ్మలు కాదు. కొన్ని వేల బొమ్మలు అక్కడ దర్శనమిస్తాయి. ఇంతకీ ఆ కిట్టీ హౌస్‌ ఎక్కడుందో తెలుసా? 


 జపాన్‌లో యొత్తుకైడోలోని మసావో గుంజి అనే మాజీ పోలీస్‌ అధికారికి హలో కిట్టీ బొమ్మలంటే చాలా ఇష్టం. 35 ఏళ్ల వయసులో ఆ బొమ్మలపై ఇష్టం పెంచుకున్నాడు. అప్పటి నుంచి కనిపించిన ప్రతి కిట్టీ బొమ్మను కొనడం మొదలుపెట్టాడు.


 అలా అతడు 5వేలకు పైగా రకరకాల హలో కిట్టీ బొమ్మలు సేకరించాడు. ఆ బొమ్మలతో తన ఇంటిని పూర్తిగా నింపేశాడు. ఆ ఇంటికి కిట్టీ హౌస్‌ అని పేరు పెట్టాడు. మసావో పేరు గిన్నిస్‌ బుక్‌ రికార్డుల్లోకి కూడా ఎక్కింది. చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ కిట్టీ బొమ్మలను చూడటానికి మసావో ఇంటికి వస్తుంటారట.