Advertisement
Advertisement
Abn logo
Advertisement

‘గీతం’లో ఉత్సాహంగా కేక్‌ మిక్సింగ్‌

పండ్లు, డ్రైఫ్రూట్స్‌ను మిక్సింగ్‌ చేస్తున్న విద్యార్థులు

సాగర్‌నగర్‌, నవంబరు 29: క్రిస్మస్‌, నూతన సంవత్సర వేడుకలకు సన్నాహకంగా గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం విద్యార్థుల వసతిగృహంలో సోమవారం కేక్‌ మిక్సింగ్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. గీతం హాస్పిటాలిటీ విభాగం ఆధ్వర్యంలో గీతం విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్‌ జోయిల్‌ పర్యవేక్షణలో గీతం సధర్మసదన్‌ హాస్టల్‌లో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. వివిధ రకాల పండ్లు, డ్రై ఫ్రూట్స్‌ వంటి వాటిని కలుపుతూ విద్యార్థులు సందడి చేశారు. ఈ మిశ్రమాన్ని నిల్వ చేసి క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ వేడుకల సమయంలో కేక్‌ల తయారీకి వినియోగిస్తారు.Advertisement
Advertisement