సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలు

ABN , First Publish Date - 2020-02-13T06:07:07+05:30 IST

రాష్ట్ర ఆవిర్భావం తరవాత కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం వందలాది గురుకులాలను స్థాపించింది. అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తూ

సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలు

రాష్ట్ర ఆవిర్భావం తరవాత కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం వందలాది గురుకులాలను స్థాపించింది.  అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తూ దళిత, గిరిజన, బహుజనులలో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తోంది. ఈ గురుకుల పాఠశాలలు విద్యార్థులను ఆణిముత్యాలుగా తీర్చిదిద్దుతూ 21వ శతాబ్దపు సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేలా శిక్షణ ఇస్తున్నాయి. 2020-21 విద్యా సంవత్సరానికి గాను అయిదో తరగతిలో ప్రవేశానికి నోటిఫికేషన్‌ వెలువడింది. అభ్యర్థులను ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.


వివిధ ప్రభుత్వ శాఖలు నిర్వహిస్తున్న గురుకులాలు - వాటి సంఖ్య


సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు 230

గిరిజన సంక్షేమ  గురుకులాలు 77

బిసి సంక్షేమ గురుకుల పాఠశాలలు 261

టిఆర్‌ఇఐఎస్‌ గురుకుల(జనరల్‌) పాఠశాలలు 35


గురుకులాల ప్రత్యేకతలు


ఇంగ్లీష్‌ మీడియంలో బోధన

సమర్థులు, సుదీర్ఘానుభవజ్ఞులైన ఉపాధ్యాయుల బోధన

24 గంటలు ఉపాధ్యాయుల పర్యవేక్షణ

ఐఐటి, ఎంసెట్‌, నీట్‌ వంటి అనేక పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తూ ఉత్తమ ర్యాంకులతో ప్రతిష్ఠాత్మకమైన విద్యాసంస్థల్లో ప్రవేశాలు కల్పించడం

అధిక సంఖ్యలో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఎంబిబిఎస్‌, బిడిఎస్‌లో ప్రవేశాలు పొందేలా ఉత్తమ శిక్షణ

సెంట్రల్‌ యూనివర్సిటీలు, టిస్‌ వంటి ప్రతిష్ఠాత్మకమైన విశ్వవిద్యాలయాల్లో ప్రవేశానికి ఉత్తమ శిక్షణ


విద్యార్థులకు కల్పించే సౌకర్యాలు


సన్నబియ్యంతో సహా అన్ని పోషక విలువలు ఉన్న చక్కటి రుచికరమైన ఆహారం అందించడం

పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు ఉచిత సరఫరా

మూడు జతల యూనిఫాం సరఫరా

పిటి డ్రెస్‌, ట్రాక్‌ సూట్‌, స్పోర్ట్స్‌ షూ, సాక్స్‌, ఇతర సౌకర్యాల కల్పన

నెలకు 4 సార్లు చికెన్‌, రెండు సార్లు మటన్‌తో భోజనం


అర్హత


అభ్యర్థుల వయసు 9 నుంచి 11 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఎస్సీ కన్వర్టెడ్‌ క్రైస్తవ విద్యార్థులకు ప్రభుత్వ నిబంధనలను అనుసరించి వయోపరిమితిలో మూడేళ్ల సడలింపు ఉంటుంది.

ఎంజెపిటిబిసిడబ్ల్యూఆర్‌ఎస్‌ కౌడిపల్లి పాఠశాలలో ప్రవేశానికి గాను మత్స్యకార వృత్తికి చెందిన తెలంగాణలోని అన్ని జిల్లాల విద్యార్థులు అర్హులు

టిఆర్‌ఎస్‌ సర్వేల్‌(నల్గొండ జిల్లా) రీజనల్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ పాఠశాలలో ప్రవేశానికి, తెలంగాణలోని అన్ని జిల్లాల వారు అర్హులు. ఈ పాఠశాలలో ప్రవేశానికి అభ్యర్థి ప్రతిభ, రిజర్వేషన్‌ ప్రాతిపదికన ప్రవేశాలు కల్పిస్తారు.


ప్రవేశ పరీక్ష


పరీక్షలను 100 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్ష తెలుగు, ఇంగ్లీష్‌ మీడియంలలో ఉంటుంది. ప్రశ్న పత్రం ఆబ్జెక్టివ్‌ టైప్‌లో ఉంటుంది. పరీక్ష వ్యవధి రెండు గంటలు. ప్రశ్నలన్నీ నాలుగో తరగతి స్థాయిలోనే ఉంటాయి. మొత్తం కేటాయించిన మార్కులు 100. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. తెలుగు నుంచి 20, ఇంగ్లీషు నుంచి 25, గణితం నుంచి 25, పరిసరాల విజ్ఞానం నుంచి 20, మెంటల్‌ ఎబిలిటీ నుంచి 10 ప్రశ్నలు వస్తాయి.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో


ఆన్‌లైన్‌లో దరఖాస్తుకి చివరి తేదీ: మార్చి 1

దరఖాస్తు ఫీజు: రూ.100

ప్రవేశ   పరీక్ష తేదీ: 2020 ఏప్రిల్‌ 12

వెబ్‌సైట్‌: జ్ట్టిఞట://ఠీఠీఠీ.్టటఠీట్ఛజీట.జీుఽ/

Updated Date - 2020-02-13T06:07:07+05:30 IST