Delhiలో నేటి నుంచి కేవలం సీఎన్జీ, ఎలక్ట్రిక్ వాహనాలకే అనుమతి

ABN , First Publish Date - 2021-11-27T12:48:08+05:30 IST

ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగిన దృష్ట్యా శనివారం నుంచి సీఎన్‌జీ, ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే నగరంలోకి అనుమతించనున్నారు....

Delhiలో నేటి నుంచి కేవలం సీఎన్జీ, ఎలక్ట్రిక్ వాహనాలకే అనుమతి

న్యూఢిల్లీ: ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగిన దృష్ట్యా శనివారం నుంచి  సీఎన్‌జీ, ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే నగరంలోకి అనుమతించనున్నారు.ఢిల్లీలో కాలుష్యాన్ని నివారించేందుకు వీలుగా డిసెంబర్ 3వతేదీ వరకు అన్ని పెట్రోల్, డీజిల్ వాహనాల రవాణాపై నిషేధం విధించారు.‘‘ఢిల్లీలో వాయు కాలుష్యం గణనీయంగా పెరిగింది.వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. ఢిల్లీ వెలుపల నుంచి అత్యవసరమైన సేవల ట్రక్కులు మినహా ఇతర వాహనాల ప్రవేశం నిలిపివేశాం’’ అని ఢిల్లీ పర్యావరణశాఖ మంత్రి గోపాల్ రాయ్ చెప్పారు.అంతకు ముందు నవంబరు 18వతేదీన నిత్యావసర వస్తువులు తీసుకువచ్చేవి మినహా ఇతర రాష్ట్రాల ట్రక్కులను రాజధానిలో ప్రవేశించడాన్ని ఢిల్లీ సర్కారు నిషేధించింది.


ఢిల్లీలోని పాఠశాలలు, ఇతర విద్యాసంస్థలు నవంబర్ 29 నుంచి తిరిగి తెరవడానికి అనుమతినిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.ఢిల్లీ, ఎన్సీఆర్ లలో నిర్మాణ కార్యకలాపాలను నిషేధించారు. అయితే ప్లంబింగ్ వర్క్, ఇంటీరియర్ డెకరేషన్, విద్యుత్, వడ్రంగి లాంటి కాలుష్య రహిత పనులు చేసుకోవచ్చు. ఢిల్లీలో శుక్రవారం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 368 నమోదైందని సిస్టం ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్‌కాస్టింగ్ అండ్ రీసెర్చ్ తెలిపింది.  

Updated Date - 2021-11-27T12:48:08+05:30 IST