Abn logo
Sep 19 2021 @ 08:24AM

పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి

గుమ్మిడిపూండి(చెన్నై): పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియం త్రణకు మొక్కలు నాటాలని ఎమ్మెల్యే గోవిందరాజన్‌ పిలుపునిచ్చారు. తిరువళ్లూర్‌ జిల్లా గుమ్మిడి పూండి యూనియన్‌ సిప్కాట్‌లో అటవీ శాఖ ఆధ్వ ర్యంలో శనివారం మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమానికి అటవీ శాఖ అధికారి సురేష్‌బాబు నేతృత్వం వహించగా, ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే టీజే గోవిందరాజన్‌ పాల్గొని మొక్కలు నాటారు.