మొక్కలతోనే పర్యావరణ పరిరక్షణ

ABN , First Publish Date - 2021-07-30T05:28:43+05:30 IST

మొక్కల పెంపకంతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమని జడ్పీ సీఈవో బి.లక్ష్మీపతి తెలిపారు.

మొక్కలతోనే పర్యావరణ పరిరక్షణ
కవిటి : కుసుంపురంలో మొక్క నాటుతున్న సీఈవో లక్ష్మీపతి

జడ్పీ సీఈవో లక్ష్మీపతి

కవిటి: మొక్కల పెంపకంతోనే పర్యావరణ పరిరక్షణ  సాధ్యమని జడ్పీ సీఈవో బి.లక్ష్మీపతి తెలిపారు. గురువారం  మండలంలోని కుసుంపురంలో రోడ్డుపక్కన మొక్కలు నాటారు. అనంతరం బల్లిపుట్టుగ సచివాలయంలో రికార్డులు పరిశీలించి, సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో పి.సూ ర్యనారాయణ, ఏఎంసీ ఉపాఽధ్యక్షులు రజనీకుమార్‌ దొళాయి, శివ బిసాయి, ఏపీవో శ్రీనివాస్‌  పాల్గొన్నారు.   సోంపేట: వలంటీర్లు, ఆరోగ్యసిబ్బంది  ఫీవర్‌ సర్వేను పక్కాగా నిర్వహించాలని జడ్పీసీఈవో బి.లక్ష్మీపతి కోరారు. గురువారం పట్టణంలోని ఒకటి, రెండు సచివాలయాలను పరిశీలించారు.  ఆయన వెంట ఎంపీడీవో సీహెచ్‌ శ్రీనివాసరెడ్డి ఉన్నారు. ఆమదాలవలస రూరల్‌: ఉపాఽధి హమీ పథకంలో భాగంగా మొక్కలు నాటడంలో నిర్లక్ష్యం ప్రదర్శించడంపై  డ్వామా అడిషనల్‌ పీడీ ఎం.రోజారాణి ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం కొర్లకోట, శ్రీనివాసాచార్యులపేట, అక్కులపేట, ఈసర్లపేటల్లో రోడ్డు పక్కనే నాటిన మొక్కలు  పరిశీలించారు. మొక్కలు నాటిన తర్వాతకర్రలతో కట్టాల్సిఉన్నా, అలాగే విడిచిపెట్టడంతో ఉపాధి అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆమె వెంట డుమా సీడీసీఎల్‌ఆర్‌సీ హరిత పాల్గొన్నారు.

  



Updated Date - 2021-07-30T05:28:43+05:30 IST