అన్ని వర్గాలకు సమన్యాయమే ప్రభుత్వ లక్ష్యం

ABN , First Publish Date - 2021-07-31T06:49:38+05:30 IST

అన్ని వర్గాలకు సమన్యాయం చేయడమే వైసీపీ లక్ష్యమని ఎమ్మెల్యే మధుసూదన్‌యాదవ్‌ అన్నారు.

అన్ని వర్గాలకు సమన్యాయమే ప్రభుత్వ లక్ష్యం
నూతన వైస్‌ చైర్మన్‌ను అభినందిస్తున్న ఎమ్మెల్యే మధుసూదన్‌

ఎమ్మెల్యే మధుసూదన్‌యాదవ్‌

కనిగిరి, జూలై 30: అన్ని వర్గాలకు సమన్యాయం చేయడమే వైసీపీ లక్ష్యమని ఎమ్మెల్యే మధుసూదన్‌యాదవ్‌ అన్నారు. స్థానిక నగర పంచాయతీ కార్యాలయంలో రెండవ వైస్‌ చైర్మన్‌ ఎంపిక కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉన్నత పదవుల్లో దళితవర్గాలకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా ఎస్సీ వర్గానికి చెందిన 15వ వార్డు కౌన్సిలర్‌  మాణిక్యరావును రెండవ వైస్‌చైర్మన్‌గా పాలకవర్గం ఏకగ్రీవంగా ఆమోదించిందన్నారు. కందుకూరు సబ్‌కలెక్టర్‌ అపరాజితా సింగ్‌ ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌గా వ్యవహరించారు. అనంతరం మాణిక్యరావు ప్రమాణస్వీకారం చేశారు. నూతనంగా ఎంపికైన రెండో వైస్‌చైర్మన్‌కు పాలకవర్గం శుభాకాంక్షలు తెలిపింది. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ దళిత వర్గాలకు సంక్షేమ పథకాల లబ్ధిని కల్పించే దిశగా కృషి చేయాలని మాణిక్యరావుకు సూచించారు. ఈ కార్యక్రమంలో  చైర్మన్‌ గఫార్‌, తహసీల్దార్‌ పుల్లారావు, కమిషనర్‌ డీవీఎస్‌ నారాయణరావు, నగర పంచాయతీ కౌన్సిలర్లు పాల్గొన్నారు.

పచ్చదనం తాండవించాలి

కనిగిరి: రాష్ట్రంలో పచ్చదనం తాండవించాలనే సంకల్పంతో కొండ ప్రాంతాల్లో కూడా పచ్చతోరణం కార్యక్రమం ద్వారా మొక్కలు పెంపకం చేపడుతున్నట్లు ఎమ్మెల్యే మధుసూధన్‌ యాదవ్‌ అన్నారు. మండల పరిధిలోని గురవాజీపేట కొండల్లో ఎన్‌ఆర్‌ఈజీఎ్‌స డ్వామా ఆధ్వర్యంలో శుక్రవారం కొండదిగువన ట్రీ బాల్స్‌ వేసి, మొక్కలను నాటారు.  మొక్కలు నాటడంతో పాటు, ట్రీ బాల్స్‌ వేయడం ద్వారా వర్షాలు పడి బాల్స్‌లో ఉన్న మట్టి ద్వారా భూమిలోకి చొచ్చుకొని పోయి మొక్కలు వస్తాయన్నారు. కార్యక్రమంలో నగరపంచాయతీ చైర్మన్‌ షేక్‌ అబ్దుల్‌ గఫార్‌, పీడీ శీనారెడ్డి, వైసీపీ నాయకలు మడతల కస్తూరిరెడ్డి, వేల్పుల వెంకటేశ్వర్లు యాదవ్‌, రామనబోయిన శ్రీనివాసులు యాదవ్‌, వెటర్నరీ ఏడీఏ సత్యనారాయణ, ఎన్‌ఆర్‌ఈజీఎ్‌స అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-07-31T06:49:38+05:30 IST