అన్ని కులాలకూ..సమాన ప్రాధాన్యం!

ABN , First Publish Date - 2020-11-23T08:24:47+05:30 IST

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలన్నీ అన్ని కులాలకూ సమాన ప్రాధాన్యతనిచ్చాయి. రిజర్వేషన్ల

అన్ని కులాలకూ..సమాన ప్రాధాన్యం!

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పార్టీల తీరు

జనరల్‌ స్థానాల్లో అత్యధికంగా రెడ్లకు చాన్స్‌

యాదవ, గౌడ కులాలకూ సముచితస్థానం

హైదరాబాద్‌ సిటీ, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలన్నీ అన్ని కులాలకూ సమాన ప్రాధాన్యతనిచ్చాయి. రిజర్వేషన్ల ప్రకారం అధికార పార్టీ ఏ సామాజిక వర్గానికి టికెట్‌ కేటాయించిందో.. ప్రతి పక్షాలు కూడా అదే కులానికి చెందిన అభ్యర్థిని నిలబెట్టాయి. కొన్ని డివిజన్లలో సంబంధిత సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి దొరకకపోవడంతో.. ఇతర కులానికి చెందిన వారిని తీసుకొచ్చారు. దీంతో నగరంలోని 150 డివిజన్లలో టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌  పార్టీల నడుమ ఆసక్తి పోరు నెలకొంది.


కులాల వారీగా టీఆర్‌ఎస్‌ టికెట్లు..

150 డివిజన్లలో అధికార టీఆర్‌ఎస్‌ అన్ని కులాలను ప్రోత్సహిస్తూ టికెట్లు ఇచ్చింది. రెడ్డి సామాజిక వర్గానికి-30, కమ్మలకు-5, యాదవులకు-14, గౌడలకు-16, ముదిరాజ్‌లకు-5, మున్నూరుకాపులకు-14, మైనారిటీలకు-17, కాపులకు-1, ఎస్సీలకు-8, ఎస్టీలకు-1 చొప్పున సీట్లను కేటాయించారు. మిగతా సీట్లను రిజర్వేషన్‌ ప్రకారం ఇతర బీసీ కులాలకు కట్టాబెట్టారు.



బీజేపీలో ఇలా..

బీజేపీలో.. రెడ్డి కులస్తులకు-26, కమ్మలకు-2, యాదవులకు-16, గౌడలకు-10, ముదిరాజ్‌లకు-5, మున్నూరుకాపులకు-10, మైనారీటీలకు-1, కాపులకు-4, ఎస్సీలకు-10, ఎస్టీలకు-1 టికెట్‌ ఇచ్చారు. మిగతా సీట్లను రిజర్వేషన్‌ ప్రకారం ఇతర బీసీలకు కేటాయించారు.



కాంగ్రె్‌సలోనూ..

కాంగ్రెస్‌ పార్టీ సైతం అన్నివర్గాలకూ ప్రాధాన్యమిచ్చింది. రెడ్లలకు-16, కమ్మలకు-1, యాదవులకు-8, గౌడలకు-12, ముదిరాజ్‌లకు-5, మున్నూరుకాపులకు-2, మైనారీటీలకు-34, కాపులకు-1, ఎస్సీలకు-8, ఎస్టీలకు-1 టికెట్‌ ఇచ్చారు. మిగిలిన సీట్లను రిజర్వేషన్‌ ప్రకారం ఇతర కులాలకు కేటాయించారు.




పార్టీల వారీగా మహిళలకు కేటాయించిన సీట్లు


డివిజన్లు   150

టీఆర్‌ఎస్‌  84

బీజేపీ    73 

కాంగ్రెస్‌  75


Updated Date - 2020-11-23T08:24:47+05:30 IST