అనుబంధ సంస్థలో ఈక్విటీ కేపిటల్‌ జారీ...

ABN , First Publish Date - 2021-07-18T23:40:44+05:30 IST

మాతృ సంస్థకు వాటాల ప్రాధాన్యత కేటాయింపు ప్రతిపాదనను స్టాక్ ఎక్స్ఛేంజీలు పరిశీలిస్తున్నట్లు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ సంబంధిత హౌసింగ్ ఫైనాన్స్ విభాగం వెల్లడించింది

అనుబంధ సంస్థలో ఈక్విటీ కేపిటల్‌ జారీ...

ముంబై : మాతృ సంస్థకు వాటాల ప్రాధాన్యత కేటాయింపు ప్రతిపాదనను స్టాక్ ఎక్స్ఛేంజీలు పరిశీలిస్తున్నట్లు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ సంబంధిత హౌసింగ్ ఫైనాన్స్ విభాగం వెల్లడించింది. ఈ ఏడాది జూన్‌లో ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ అదనపు వాటాను తీసుకోవడం ద్వారా అనుబంధ సంస్థలో సుమారు రూ. 2,334.70 కోట్ల ఈక్విటీ కేపిటల్‌ను ఇన్ఫ్యూజ్ చేసింది. ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ (ఎల్‌ఐసీ హెచ్‌ఎఫ్‌ఎల్) తన ప్రమోటర్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్‌ఐసీ) కు ఒక్కొక్క షేర్‌ను రూ. 514.25 చొప్పున ప్రిఫరెన్షియల్ ప్రాతిపదికన నిర్ణయించింది. బీఎస్ఈ ఇండియా లిమిటెడ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి శుక్రవారం(జూలై 16) ఈ మెయిల్‌ను కంపెనీ అందుకుంది. ఆ మెయి‌ల్‌లో ప్రిఫరెన్షియల్ అలాట్‌మెంట్ అంశం ఎక్స్ఛేంజీల ద్వారా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.  

Updated Date - 2021-07-18T23:40:44+05:30 IST