Advertisement
Advertisement
Abn logo
Advertisement

అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ పాలన: ఎర్రబెల్లి

హనుమకొండ జిల్లా: అణగారిన వర్గాల ఆశాజ్యోతి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అంబేద్కర్ ఒక్క ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి కాదన్నారు. ఎస్సీలకు మూడు ఎకరాల భూమి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా.. గ్రామాల్లో భూమి అమ్మే వాళ్ళు లేరని అన్నారు. దళిత బంధు పథకం ద్వారా దళితులకు రూ. 10 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు.


ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మాట్లాడుతూ రాజకీయ అసమానతలను రూపుమాపడానికి అంబేద్కర్ అనేక సంస్కరణలు తీసుకువచ్చారన్నారు. అంబేద్కర్ ఆశయ సాధనకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. వెనక బడిన కులాలను ముందుకు తీసుకురావడానికి రాజ్యాంగంలో రిజర్వేషన్లు కల్పించారని రాజయ్య అన్నారు.

Advertisement
Advertisement