అసలు నాలుక్కి ఎసరేమో?

ABN , First Publish Date - 2020-08-14T06:30:28+05:30 IST

కాలంలో ఆరుఖండాల్లోని మానవాళిని గడగడలాడించిన పాండెమిక్ బహుశా కోవిడే కావచ్చు. సమాజంలోని కొన్ని వ్యవస్థలు కోవిడ్ కోరలు విరిచే పనిలో నిమగ్నమయ్యాయి...

అసలు నాలుక్కి ఎసరేమో?

చరిత్రలో ఇప్పటి వరకూ ఏక

కాలంలో ఆరుఖండాల్లోని మానవాళిని గడగడలాడించిన పాండెమిక్ బహుశా కోవిడే కావచ్చు. సమాజంలోని కొన్ని వ్యవస్థలు కోవిడ్ కోరలు విరిచే పనిలో నిమగ్నమయ్యాయి. ఈ క్రమంలోనే శాస్త్రీయత, అశాస్ర్తీయతతో నిమిత్తం లేకుండా అనేక నివారణ, నిరోధోపాయాలు ప్రచారంలోకి వస్తున్నాయి. 11వ తేదీ వ్యాసంలో భరత్‌ ఝున్‌ఝున్‌వాలా కరోనా బారి నుంచి బయట పడడానికి కొన్ని సూచనలను చేశారు. వాటిలో సామూహిక నదీ స్నానాలు ఒకటి. హెర్డ్ ఇమ్యూనిటీ పరిపుష్టం కావడానికి చేసిన ఈ సూచనకు ఎంతో కొంత శాస్త్రీయత ఉందనుకున్నా.. అసలు ప్రశ్న ఆ నీటివనరుల స్థితి మానవారోగ్యానికి దోహదపడేలా ఉందా లేక దిగజార్చేలా ఉందా అన్నదే.


మానవ సమూహాలు చాలా వరకూ స్వార్థం కోసం, కొంత వరకూ అలక్ష్యం వల్లా నీటినీ, నేలనూ, గాలినీ కాలుష్యానికి కేరాఫ్ అడ్రస్సులుగా మారుస్తున్నాయి. దాన్ని నిరోధించడానికి ఉన్న వ్యవస్థల్ని నిస్సహాయతా, నీతిమాలిన తనం వంటి కాలుష్యాలు పీడిస్తున్నాయి. ఈ వాస్తవికతను బట్టి సామూహిక స్నానాల వల్ల ఆశించే ప్రయోజనం లేకపోగా అందుకు విరుద్ధమైన ఫలితం అవకాశం ఉంది. సామూహిక స్నానాలు కోవిడ్‌ను తోక ముడిపించే అస్త్రాల్లో ఒకటనుకున్నా, నీటిపట్టులను ప్రక్షాళన చేయకుండా అలా చేస్తే, కొండ నాలుక్కి మందేస్తే ఉన్న నాలుకే పోయిన చందంగా కొత్త రుగ్మతలు పురుడు పోసుకోవచ్చు.

వి-రాగి

Updated Date - 2020-08-14T06:30:28+05:30 IST